AnilRavipudi: యాంకర్ ను కిస్ చేసిన అనిల్ రావిపూడి.. రసికుడే అంటూ?

AnilRavipudi: టాలీవుడ్ లో ఇప్పటి వరకు ప్లాఫ్ చూడని స్టార్ డైరెక్టర్ల జాబితాలో రాజమౌళి తర్వాత నిలిచిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ‘ఎఫ్2’తో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న ఈ స్టార్ డైరెక్టర్ మంచి స్పీడ్ మీదున్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా అనిల్ రావిపూడికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది.

ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో వస్తున్న్ ‘కామెడీ స్టాక్ ఎక్ఛేంజ్’ షోకి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరిస్తుండగా.. ఈ షోకి సంబంధించిన తాజాగా ప్రోమో చర్చకు దారితీసింది. ప్రోమోలో అనిల్ రావిపూడి యాంకర్ ని ముద్దు పెట్టుకోవడం కనిపించింది. యాంకర్ దీపిక పిల్లిని అనిల్ రావిపూడి ముద్దు పెట్టుకున్న సీన్ కనిపించింది.

తాను జడ్జిగా వ్యవహరిస్తున్న ‘కామెడీ స్టాక్ ఎక్ఛేంజ్’ ప్రోగ్రాంలో ఓ టాస్క్ లో భాగంగా ఇలా కిస్ చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఎలా చేసినా, దేని కోసం చేసినా డైరెక్టర్ మాత్రం తన కళను చూపించాడంటూ సోషల్ మీడియాలో అప్పుడే చర్చ మొదలైంది. అనిల్ రావిపూడి బయటకు కనిపించడు కానీ మంచి రసికుడే అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

కాగా అనిల్ రావిపూడి ప్రస్తుతం నందమూరి బాలయ్యతో ఎన్బీకే 108ని ప్లాన్ చేస్తున్నాడు. ఫ్యాన్ బాయ్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా.. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అనిల్ రావిపూడి సినిమా చేసినా లేదంటే షో చేసినా అది హిట్టే అనే టాక్ వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -