Telangana: తెలంగాణలో మరో ఉపఎన్నిక రాబోతుందా?

Telangana: త్వరలో తెలంగాణలో మరో ఉపఎన్నిక రానుందని ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఉపఎన్నిక ముగియడంతో.. త్వరలో తెలంగాణలో మరో నియోజకవర్గానికి ఉపఎన్నిక రాబోతుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ సారి వేములవాడ నియోజకవర్గానికి ఉపఎన్నికలు వస్తాయంటూ జోరుగా ఊహాగానాలు హల్ చల్ చేస్తోన్నాయి. కరీంనగర్ జిల్లాలోని వేములవాడ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నికలు రానున్నాయంటూ కొంతమంది ప్రముఖులు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వైరల్ గా మారుతోన్నాయి. మునుగోడు ఉపఎన్నిక ఫలితాల వెలువడిన తర్వాతి రోజే ఈ వార్తలు గుప్పుమనడం చర్చనీయాంశంగా మారింది.

 

 

ప్రస్తుతం వేములవాడ నుంచి టీఆర్ఎస్ తరపున చెన్నమనేని రమేష్ ఎమ్మెల్యేగా కొనసాగుతోన్నాయి. అయితే ఆయనకు భారత పౌరసత్వంతో పాటు జర్మనీ పౌరసత్వం కూడా ఉందని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలంటూ ప్రత్యర్ధి అభ్యర్థి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 

ఈ పిటిషన్ పై గత నాలుగు ఏళ్లుగా విచారణ జరుగుతోంది. చెన్నమనేని పౌరసత్వంకి రెండు దేశాల పౌరసత్వం ఉన్న మాట వాస్తవేమనని ఇటీవల తెలంగాణ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత పౌరసత్వంతో పాటు జర్మనీ పౌరసత్వం కలిగి ఉండటం వల్ల చెన్నమనేని రమేష్ కు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖల చేసింది.

 

కేంద్ర ప్రభుత్వం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ టి.సూర్యకిరణ్ రెడ్డి ఇటీవల హైకోర్టులో వాదనలు వినిపించారు. రెండు పౌరసత్వాలు కలిగి ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. దీంతో త్వరలో చెన్నమనేని రమేష్ కేసుపై హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశముందని, ఆయనను అనర్హుడిగా ప్రకటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

 

ఇదే జరిగితే తెలంగాణలో మరో ఉపఎన్నిక అనివార్యం కానుంది. ఇదే జరిగితే తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత పెరగనుంది. రెండోసారి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నాగార్జున సాగర్, హుజూర్ నగర్, దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికలు జరిగాయి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -