WhatsApp: వాట్సాప్ లో మరొక ఫీచర్.. ఇబ్బందుల నుంచి బయటపడేస్తుందట?

WhatsApp: ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా నిత్యం లక్షలాదిమంది ఉపయోగించే సోషల్ మీడియా యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి. కాగా వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కొత్త ఫీచర్ ని కూడా వాట్సాప్ సంస్థ అందుబాటులోకి తీసుకురానుంది. అదేమిటంటే కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా మనం గ్రూపులో లేదా పర్సనల్గా తప్పు మెసేజ్ చేసి వెంటనే డిలీట్ చేస్తూ ఉంటారు.

 

మెసేజ్ ను డిలిట్ చేసే క్రమంలో కొన్ని కొన్ని సార్లు డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌ ప్రెస్‌ చేయబోయి డిలీట్‌ ఫర్‌ మీ ప్రెస్‌ చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఏం చేయాలి ఎలా బయటపడాలి అన్న ఫీచర్ ని త్వరలోనే వాట్సాప్ సంస్థ పరిచయం చేయనుంది. వాట్సాప్ సంస్థ ఇటీవలే వాట్సాప్ లో యాక్సిడెంటల్ డిలీట్ అనే కొత్త ఫీచర్‌ను లాంచ్‌ చేసినట్లు ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులకు యాక్షన్‌ను రివర్స్‌ చేయడానికి 5 సెకన్ల విండోను అందిస్తుంది. ఆ సమయంలో యూజర్లు UNDO చేయడం ద్వారా మళ్లీ డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌ చేయవచ్చు.

 

అయితే ఈ కొత్త ఫీచర్ కొన్ని ఐఫోన్ , ఆండ్రాయిడ్ డివైజ్‌లలో పరికరాల్లో అందుబాటులోకి వచ్చింది. కాగా ఈ ఫీచర్ పర్సనల్, గ్రూప్‌ చాట్‌లలో కూడా పని చేస్తుంది. ఒకవేళ ఈ ఫీచర్ నికరంగా అందుబాటులోకి తీసుకువస్తే వినియోగదారులకు ఎంతో బెటర్ గా ఉంటుంది అని చెప్పవచ్చు. కాగా ఇప్పటికే వాట్సాప్ సంస్థ డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌ లిమిట్‌ టైమ్‌ ని పెంచిన విషయం తెలిసిందే. దీనిని ఇంకా 60 గంటలకు పెంచిన విషయం మనందరికీ తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -