Jagan: జగన్ సర్కార్ కు మరో భారీ షాక్ తప్పదా.. ఏమైందంటే?

Jagan: ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు మీద ఇప్పటికే ఎన్నో కేసులు ఉన్నాయి. ఇటీవల వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసిపి ఎంపి అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగిసుకుంటుంది. అలాగే లిక్కర్ స్కామ్‌ కేసులు కూడా వైసీపీ ఎంపీల మెడకు చుట్టుకోగా వాటిని విడిపించుకొని బయటపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో మరో కొత్త కేసు జగన్‌ సర్కారు మెడకు చుట్టుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. అదే… బైజూస్ ఈడీ కేసు.

ఆన్లైన్ ద్వారా పిల్లలకు పాఠాలు అందించే బై జూస్ సంస్థ సీఈఓ రవీంద్రన్ పై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు శనివారం బెంగళూరులోని ఆయన నివాసం, కార్యాలయాలలో సోదాలు నిర్వహించిన పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకొన్నారు. బైజూస్ సంస్థ విదేశాల నుంచి రూ.28,000 కోట్లు ప్రత్యక్ష పెట్టుబడులు సాధించింది. అయితే వాటికి సంబందించిన లెక్కలలో చాలా అవకతవకలున్నాయని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.

 

ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలలోని విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేందుకు బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఆ సంస్థ తాము పూర్తి ఉచితంగానే విద్యార్థులకు పాఠాలు అందిస్తున్నామని తెలిపింది. అయితే జగన్ ప్రభుత్వం దాని కోసం సుమారు 750 కోట్లు ఖర్చు చేశామని చెప్పటం అనుమానాలు కలుగుతున్నాయి.కానీ బైజూస్ సంస్థ మొదట్లో హడావిడి చేసినా ఇప్పుడు పాఠాలు చెప్పటం లేదు.

 

ఏపీ ప్రభుత్వం బైజూస్ సంస్థతో రూ.750 కోట్లకు ఒప్పందం చేసుకొన్నామని చెప్పింది. ఒకవేళ బైజూస్ ఉచితంగా పాఠాలు ఇస్తున్నట్లయితే దానికి రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము చెల్లించామని అబద్దం చెప్పినట్లు అర్థం. అంటే ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్ళిన్నట్లు?ఇది ఇప్పుడు ఈడీ విచారణలో బయటపడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఒప్పందంలో ఏమైనా అవకతవకలు ఉన్నట్లు ఈడీ గుర్తిస్తే జగన్ సర్కారుకి కొత్త సమస్యలు తప్పవు…. జగన్ ప్రభుత్వం మెడకి బైజూస్ కేసు చుట్టుకొనే అవకాశం ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -