BCCI: బీసీసీఐ మరో కీలక నిర్ణయం.. దేశవాళీ క్రికెట్ టోర్నీలకు ప్రైజ్‌మనీ భారీగా పెంపు

BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ టోర్నమెంట్‌ల ప్రైజ్‌మనీ భారీగా పెంచింది. దేశవాళీ టోర్నమెంట్‌లో విజయం సాధించే జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీని భారీగా పెంచుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జైషా ఈ విషయాన్ని ట్విట్టర్‌లో తాజాగా ప్రకటించారు. ఇప్పటివరకు రంజీ ట్రోఫీలో గెలిచిన జట్టుకు రూ.2 కోట్ల ప్రైజ్‌మనీ ఇస్తుండగా.. ఇప్పుడు దానిని ఏకంగా రూ.5 కోట్లకు పంపారు. ఇక సెమీ ఫైనల్‌లో ఓడిపోయిన జట్టుకు ప్రస్తుతం రూ.50 లక్షలు మాత్రమే ఇస్తుండగా.. ఇప్పుడు దానికి రూ.కోటికి పెంచుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

రంజీ ట్రోఫీలో ప్రస్తుతం రన్నరప్‌కు రూ.కోటి మాత్రమే ఇస్తుండగా.. ఇప్పుడు రూ.3 కోట్లకు పెంచారు. అలాగే ఇరానీ కప్‌లో ప్రస్తుతం విజేతకు రూ.25 లక్షలు ఇస్తుండగా.. ఇప్పుడు రూ.50 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇఫ్పటివరకు ఇరానీ కప్ లో రన్నరప్ కు ఎలాంటి ప్రైజ్‌మనీ లేదు. కానీ ఇప్పటినుంచి రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. ఇక దులీప్ ట్రోఫీలో విజేతకు రూ.40 లక్షలు. రన్నరప్ కు రూ,.20 లక్షలు ఇస్తుండగా.. ఇప్పుడు విజేతకు రూ.కోటి, రన్నరప్ కు రూ.50 లక్షలకు ఇవ్వనున్నారు.

 

అలాగే విజయ్ హజారే ట్రోపీలో ఇప్పటివరు విజేతకు రూ.30 లక్షలు, రన్నరప్ కు రూ.15 లక్షలు ఇస్తుండగా.. ఇప్పుడు విజేతకు రూ.కోటి. రన్నరప్ కు రూ.50 లక్షలకు పెంచారు. ప్రొ.డీబీ దేవేదర్ ట్రోఫీలో విజేతకు రూ.25 లక్షలు, రన్నరప్ కు రూ.10 లక్షలు ఇస్తుండగా.. ఇప్పుడు వాటిని నూ.40 లక్షలకు, రూ.20 లక్షలకు పంచారు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విజేతకు రూ.25 లక్షలు, రన్నరప్ కు రూ.10 లక్షలు ఇస్తుండగా.. ఇప్పుడు రూ.80 లక్షలు, రూ.40 లక్షలకు పెంచారు.

 

ఇక మహిళల వన్డే ట్రోఫీ(సీనియర్) జట్టులో విజేతకు రూ.6లక్షలు, రన్నరప్ కు రూ.3లక్షలు ఇవ్వగా.. ఇప్పుడు వాటిని రూ.50 లక్షలు, రూ.25 లక్షలకు పెంంచారు. అటు మహిళల టీ20 ట్రోఫీ(సీనియర్) ఇప్పటివరకు విజేతకు రూ.5 లక్షలు, రన్నరప్ కు రూ.3 లక్షలు ఇస్తుండగా.. ఇప్పుడు విజేతు రూ.40 లక్షలు, రన్నరప్ కు రూ.20 లక్షలు ఇవ్వనున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -