Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ హత్య కేసు విచారణలో భాగంగా వైఎస్ వివేకానంద రెడ్డి రాసిన లేఖ పై వేలిముద్రలను గుర్తించడం కోసం నిన్ హైడ్రిన్ ఫోరెన్సిక్ పరీక్షలను నిర్వహించడానికి సిబిఐకి కోర్టు అనుమతి తెలిపింది.

ఈ పరీక్ష కోసం ఆ లేఖను ఢిల్లీCFSL పంపించడానికి న్యాయస్థానం అనుమతి తెలిపింది.ఈ లేఖకు సంబంధించి అవసరమైనన్ని సర్టిఫైడ్ కాపీలు తీసుకొని ఈ లేఖను పరీక్షకు పంపించాలని కోర్టు తెలియజేసింది. ఈ పరీక్షలలో భాగంగా ఇందులో ఎవరికి వేలిముద్రలు ఉన్నాయనే విషయాలు బయటపడనున్నాయి. ఈ ఒక్క పరీక్ష ద్వారా వివేక హత్య కేసులో నిందితులను కనుగొనడానికి మరి కాస్త అనుకూలంగా ఉంటుందని చెప్పాలి.

 

డ్రైవర్ ప్రసాద్ హత్య చేసినట్లు ఆ రోజు హత్య జరిగిన ప్రదేశంలో ఈ లేఖ దొరికింది. ఈ లెటర్ ను కడప కోర్టు ద్వారా సిబిఐ 2021లో తీసుకుంది. అయితే ఈ లేఖ వివేకా రాశారా లేదా అన్న విషయాలను తన ఇదివరకు లేఖలను పరిశీలించి ఇది వివేకా రాసారని సిబిఐ నివేదిక ఇచ్చారు. అయితే ఆ లెటర్ ను వివేక చేత ఒత్తిడి చేయించి రాయించారని అప్రూవల్ దస్తగిరి వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ లేఖను ఎలా రాయించారనే విషయాన్ని తెలియజేయడానికి నిన్ హైడ్రిన్ పరీక్ష ఒక్కటే మార్గమని ఈ పరీక్షను చేయించడానికి కోర్టు కూడా అనుమతి తెలియజేయడంతో ఈ కేసు ఓ కొలిక్కి రాబోతుందని తెలుస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపుల వల్ల సూసైడ్ చేసుకున్న మహిళ.. ఏం జరిగిందంటే?

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది బెదిరింపులు కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. సాటి మనుషుల పట్ల కనీసం మానవత్వం లేకుండా బెదిరింపులకు పాల్పడటంతో దిక్కుతోచని స్థితిలో ఓ...
- Advertisement -
- Advertisement -