Anupama: కాసుల కోసం అనుపమ అలాంటి పనులు చేస్తున్నారా?

Anupama: కొందరు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. అది ఏ పనైనా సరే.. తమకు నచ్చదు అన్నప్పుడు వదిలేయకుండా ఏదో చేయాలని చేస్తుంటారు. అలా తాజాగా హీరోయిన్ అనుపమ కూడా చేసింది. ఇంతకు ఆమె ఏం చేసిందనేది తెలుసుకుందాం.

 

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. తన అందంతో, నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు ప్రేక్షకుల నుండి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించింది. తొలిసారిగా మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా.. ఆ తర్వాత నితిన్ నటించిన ‘అఆ’ సినిమాతో నాగవల్లి పాత్రలో బాగా ఆకట్టుకుంది.

 

అలా ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే విడుదలైన కార్తికేయ 2 సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం మరో రెండు సినిమాలతో బిజీగా ఉంది.

 

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండడమే కాకుండా అల్లరి పిల్లగా పేరు తెచ్చుకుంది. నిత్యం ఏదో ఒక ఫోటోను, ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేస్తుంది. కానీ గతంలో అనుపమ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు.. తనకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం నచ్చదని తెలిపింది. కానీ ఈ మధ్య మాత్రం వరుస పోస్టులతో బాగా సందడి చేస్తుంది. అయితే ఈమధ్యనే యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.

 

ఇందులో మొదటిసారి ఒక వ్లాగ్ వీడియో కూడా పోస్ట్ చేసింది. తాజాగా తను సాంగ్ షూటింగ్ కోసం పోలాండ్ కి వెళ్లగా అక్కడ షూటింగ్ మధ్యలో చిన్న గ్యాప్ దొరకడంతో వీడియో చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారగా.. గతంలో ఈమె మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకున్న నెటిజన్స్.. సోషల్ మీడియా పోస్టులు ఇష్టం లేదు అంటూనే డబ్బుల కోసం ఇంత దిగజారి పోయావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts