Anupama Parameswaran: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అనుపమ.. అభిమానులు షాక్!

Anupama Parameswaran: తెలుగు ప్రేక్షకులకు అందాల భామ అనుపమ పరమేశ్వరన్ గురించి పెద్దగా పరిచయంకర్లేదు. ఈమె తెలుగు, మలయాళం, తమిళ సినిమాలో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. శతమానం భవతి సినిమాలో ఆమె నటనకు గాను అను ప్రేక్షకులతో ప్రశంసల వర్షం కురిపించుకుంది. ఇక ఈ అమ్మడు తన అందంతో ఎంతో మంది అభిమానులు ఆకట్టుకుంది.

ప్రేమమ్ సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అయినప్పటికీ ఈ అమ్మడుకు కొన్ని సినిమాలు అంత విజయం సాధించి పెట్టలేకపోయాయి. కానీ అందం పరంగా మాత్రం అనుపమ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇటీవల కార్తికేయ 2 సినిమాలో హీరో నిఖిల్ సరసన నటించిన అనుపమ బ్లాక్ బస్టర్ హిట్ ను తన సొంతం చేసుకుకుంది.

ఇక ఈ ముద్దు గుమ్మ సొషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలను నెట్టింట్లో పంచుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా అనుపమ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త టాప్ ట్రెండ్ లో దూసుకుపోతుంది. అదేమిటంటే అనుపమ త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. ఇకపై ఏ సినిమాలకు సైన్ చేయదని తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు సైన్ చేసిన సినిమాలను తాను పూర్తి చేసిన తర్వాత పెళ్లిబాట పడుతుందట.

తన తల్లిదండ్రుల కోరిక మేరకు అనుపమ పరమేశ్వరన్ పెళ్లి చేసుకుంటుందట. ఎందుకంటే అనుపమ తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి కొంచెం డల్ గా ఉందని అందుకని అనుపమ పెళ్లి చేసుకొని తమ కుటుంబాన్ని సంతోషపరచాలనే ఆలోచనలో ఉందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన అనుపమ ఫాన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఆశ్చర్యపోతున్నారు. అనుపమ పెళ్లి చేసుకుని పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ బిజినెస్ రంగంలో పాల్గొనాలని ఆలోచన చేస్తుందట.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -