Anurag Kasyap: కుమార్తెకు అలాంటి బెదిరింపులు.. అందుకే గుండెపోటు వచ్చిందంటున్న స్టార్ డైరెక్టర్

Anurag Kasyap: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1997 నుంచి ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలను బయటపెట్టారు. సోషల్ మీడియాలో తన కుటుంబం గురించి ట్రోలింగ్ జరిగిందని.. అందుకే దేశం విడిచి వెళ్లిపోయినట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో అసలు ఏం జరిగిందంటూ అభిమానులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంగా తన కుటుంబంపై కొందరు ద్వేషం పెంచుకున్నారని అనురాగ్ కశ్యప్ ఆరోపించారు. దీంతో తన కూతురు ఆలియా కశ్యప్‌ను కొందరు రేప్ చేసి చంపేస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా తాను ట్విట్టర్ ఉపయోగించడం కూడా మానేశానని.. ఆ తర్వాత మనసు ఉండబట్టలేకపోవడంతో సినిమాలు కూడా ఆపేసి తన కూతురు కోసం దేశం విడిచి పోర్చుగల్ వెళ్లిపోయినట్లు వివరించారు.

సోషల్ మీడియాలో తన కుటుంబం గురించి జరిగిన ట్రోలింగ్స్ వల్ల తాను మూడేళ్లు డిప్రెషన్‏లో ఉన్నానని దర్శకుడు అనురాగ్ కశ్యప్ వెల్లడించారు. అదే సమయంలో తనకు గుండెపోటు వచ్చిందని ఆయన తెలిపారు. 2019లో పోర్చుగల్ వెళ్లిపోయిన తర్వాత ప్యార్ విత్ డిజే మొహబ్బత్ సినిమా షూటింగ్ ఉండడంతో భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చిందని వివరించారు. గత ఏడాది గుండెపోటు వచ్చి ఆస్పత్రి పాలయ్యానని కన్నీటి పర్యంతమయ్యారు.

నా కూతురి మనస్తత్వం అలాగే ఉంటుంది
తన కుమార్తె చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా వ్యవహరిస్తుందని అనురాగ్ కశ్యప్ వెల్లడించారు. ఆమె మనసులో ఏదీ దాచుకోదని.. ఏమున్నా నిర్మోహమాటం లేకుండా బయటకు చెప్పేస్తుందని తెలిపారు. అయితే తనపై ట్రోలింగ్స్ రావడంతో మానసికంగా ఆమె ఇబ్బంది పడిందని.. ఆమె లోలోపల కుమిలిపోతుండం తనను ఎంతో బాధించిందని వివరించారు. ప్రతి చిన్న విషయానికి తన కుమార్తె ఆందోళనకు గురవుతుందని.. ఇదొక్కటే తనకు ఆమెలో నచ్చని విషయమని చెప్పారు. కాగా అనురాగ్ దర్శకత్వం వహిస్తున్న ప్యార్ విత్ డిజే మొహబ్బత్ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదలకు సిద్ధం అవుతోంది.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts