Anushka: ఆ చిన్న నటుడిని దారుణంగా మోసం చేసిన అనుష్క!

Anushka: ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఈ మాయా లోకంలోకి అడుగుపెట్టిన వారంతా వారి టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. అందులో అదృష్టం కలిసి వచ్చి హీరోలు, హీరోయిన్లు అయినా వాళ్ళు ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారు ఉన్నారు. ఇండస్ట్రీలో చాలా మంది నటులకు వాళ్ళు చేసే క్యారెక్టర్స్ ని ఇంటిపేరుగా మార్చి పిలుస్తుంటారు. అలా ఓ నటుడు హీరో మీద అభిమానంతో హీరో పేరును తన పేరుముందు పెట్టుకున్న నటుడు ప్రభాస్ శ్రీను.

ప్రభాస్ శ్రీను.. ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. ఆయన తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ శ్రీను సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే ముందు ప్రభాస్‌కు అసిస్టెంట్‌గా పనిచేశారు. ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్స్ లో ఒక్కరిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ శ్రీను హీరో ప్రభాస్‌తో ఎక్కువగా సినిమాలో నటించారు. ఒకప్పుడు ప్రభాస్ డేట్స్ కూడా ప్రభాస్ శ్రీనునే చూసుకుంటూ ఉండేవాడు.

ఇండస్ట్రీకి కొంతకాలం విరామం ఇచ్చిన ప్రభాస్ శ్రీను ప్రస్తుతం పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ సంచలన విషయాలను వెల్లడిస్తూ వార్తలో నిలుస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి సంచలన విషయాలను వెల్లడించారు. ఆ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వార్త ఏంటో ఒక్కసారి చూద్దామా.

ప్రభాస్ శ్రీను అనుష్కతో దిగిన ఓ ఫోటోని యాంకర్ చూపించారు. ఆ ఫోటోని చూసిన ఆయన ఈమె పెద్ద చీటర్ అని.. నన్ను చీట్ చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఆ సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకున్నారు. ఓ రోజు అనుష్క 30 కిలోమీటర్లు సైకిల్ మీదనే షూట్‌కి వచ్చానని అబద్ధం చెప్పి నన్ను మోసం చేసిందని అన్నారు. అనుష్క తన కారుపై సైకిల్ పెట్టుకుని వచ్చిందని. షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నప్పుడు కారులోనుంచి దిగి సైకిల్ తొక్కుకుంటూ వచ్చిందన్నారు. అలా తనని నమ్మించి మోసం చేసిందని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -