Anushka: ఆ స్టార్ హీరో అనుష్కను ఆంటీ అని పిలిచాడా?

Anushka: ఇటీవల ఆంటీ అనే పదం బాగా వైరల్ అయ్యింది. ప్రముఖ నటి, యాంకర్ అనసూయను ఓ హీరో ఫ్యాన్స్ ఆంటీ అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ వచ్చాయి. ఇప్పుడిదే సమస్యను మరో స్టార్ కూడా ఎదుర్కొంటున్నారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టిని ఓ హీరో తెగ ఏడిపిస్తున్నాడట. స్వీటీ అనే ముద్దు పేరు కలిగిన అనుష్కను ఆంటీ అంటూ ఆ హీరో ఆటపట్టిస్తున్నాడట. దీంతో కోపం తట్టుకోలేని అనుష్క.. ఆ కథానాయకుడ్ని లాగి పెట్టి కొడుతుందట. అమ్మాయిలను ఆంటీ అంటే ఎంత కోపం వస్తుందో తెలిసేలా చేస్తుందట. అయితే ఇదంతా నిజ జీవితంలో కాదులెండీ.

 

 

పెళ్లంటే పడని పాత్రలో స్వీటీ!

అనుష్క నటిస్తున్న కొత్త చిత్రం స్టోరీ ఇదేనని ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఇటీవల అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో శెఫ్ పాత్రలో స్వీటీ కనిపించారు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీని కమర్షియల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారట.

 

పెళ్లంటే అస్సలు పడని పాత్రను ఇందులో అనుష్క పోషిస్తున్నారని వినికిడి. వయసు దాటిపోతున్నా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండాలనుకునే స్వీటీని.. నవీన్ పొలిశెట్టి కలవడం, ఆంటీ ఆంటీ అంటూ పిలవడంతో మెయిన్ స్టోరీ మొదలవుతుందట. అనుష్కలోని మంచితనం చూసి ఆమె ప్రేమలో పడతాడట నవీన్. వీళ్ల మధ్య స్పర్మ్ డోనర్ కాన్సెప్ట్ డైలాగ్స్ ఆడియెన్స్‌ను పడిపడి నవ్వేలా చేస్తాయని ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా అనసూయ ఆంటీ కాన్సెప్ట్‌తో ఇప్పుడు ఏకంగా ఓ సినిమానే వస్తోందని అందరూ అనుకుంటున్నారు.

 

ఇకపోతే, వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా అండే అనుష్క.. ‘బాహుబలి’ (Bahubali) మూవీ తర్వాత సైలెంట్ అయ్యారు. అయితే ఈ సినిమా తర్వాత హీరో ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీ కాగా.. అనుష్క మాత్రం మరే ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ‘నిశ్శబ్దం’ తర్వాత ఆమె నుంచి ఇంకో సినిమా రాలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ, ఇతర హీరోల సరసన హీరోయిన్‌గా యాక్టింగ్ చేసే చిత్రాలను చాలా వరకు అనుష్క పక్కనబెట్టేశారు. దీంతో ఈ బ్యూటీ కెరీర్ చాలా నెమ్మదిగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఒక సినిమా చేయడానికి అనుష్క ఓకే చేయడం ఆసక్తికరంగా మారింది. నాయిక ప్రధానమైన ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YCP Schemes: వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారు.. చంద్రబాబుకు జగన్ షాక్!

YCP Schemes: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుని పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -