Anushka: అలాంటి వ్యక్తిని అనుష్క లైఫ్‌లోకి ఆహ్వానిస్తోందా?

Anushka: సూపర్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా అనుష్క పాగా వేసింది. అయితే అరుంధతి సినిమా అనుష్క కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు అనుష్క కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కొంతకాలంగా ఆమె తన స్పీడ్ తగ్గించింది. రుద్రమదేవి, బాహుబలి సినిమాల తర్వాత నిశ్శబ్ధం అనే సినిమానే అనుష్కకు చివరి సినిమా. సినిమాలకు కొంతకాలం విరామం ప్రకటించడంతో అనుష్క పెళ్లి పనుల్లో ఉందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.

 

చాలాకాలంగా ప్రభాస్‌తో అనుష్కకు ఎఫైర్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ స్విటీ ఈ వార్తలపై ఎప్పుడూ స్పందించలేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో ఓ సినిమా, కోలీవుడ్‌లో ఓ సినిమా చేస్తోంది. తెలుగులో నవీన్ పోలిశెట్టితో నటిస్తున్న ఆమె తమిళంలో మాత్రం ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో ఆమె వ్యభిచారి పాత్రను అంగీకరించినట్లు టాక్ నడుస్తోంది. గతంలో వేదం సినిమాలో కూడా అనుష్క ఇలాంటి పాత్ర చేసి శభాష్ అనిపించుకుంది.

 

ఇక్కడ విషయం ఏంటంటే.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ హీరోయిన్ అమలాపాల్ మొదటి భర్త. అతడి క్యారెక్టర్ మంచిది కాదనే ఉద్దేశంతో అమలాపాల్ విడాకులు ఇచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. విజయ్‌కు ఆడవాళ్ళు అంటే పిచ్చి అని కోలీవుడ్ మీడియాలో ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అతడి గురించి తెలిసి అనుష్క ఈ సినిమాను ఎలా అంగీకరించిందని ఆమె అభిమానులు కలవరపడుతున్నారు. సెకండ్ హ్యాండ్ గాడితో కమిట్ కావడం తమకు ఇష్టం లేదని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

 

ఇంతకీ అనుష్క పెళ్లి ఎప్పుడు?
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడు చర్చ జరిగినా అనుష్క పేరు కూడా ఆ సమయంలో వినిపిస్తుంది. ప్రభాస్, అనుష్క మంచి జోడీ అని.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు ఆరాటపడుతున్నారు. కానీ వీళ్లిద్దరి పెళ్లికి కృష్ణంరాజు అంగీకరించలేదని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు ఆయన మరణించడంతో ప్రభాస్ ఇప్పటికైనా అనుష్కను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి అనుష్క మనసులో ఏముందో ఆమె స్పందిస్తే తప్ప ఈ విషయంలో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు.

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -