Anushka Sharma: హోటల్ రూమ్ వీడియో లీక్.. అనుష్క శర్మ ఏమన్నారంటే?

Anushka Sharma: భారత మాజీ కెప్టెన్, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి తాజాగా చేదు అనుభవం ఎదురైంది. తన హోటల్ గదిలోకి ప్రవేశించిన ఓ అభిమాని.. రూమ్ అంతా వీడియో తీశాడు. అది కాస్తా సోషల్ మీడియాలో పెట్టి కింగ్ కోహ్లీ స్ రూమ్.. అంటూ ట్యాగ్ చేశాడు. దీనిపై కోహ్లీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆ వీడియోను పోస్ట్ చేసిన కోహ్లీ.. ఓ మెసేజ్ టైప్ చేసి షేర్ చేశాడు.

తమ అభిమాన వ్యక్తుల్ని, ఇష్టమైన ఆటగాళ్లను కలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీని కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. కానీ ఇప్పుడు జరిగింది సరైంది కాదు. ఈ వీడియోలో మీరు చూస్తున్నది నా వ్యక్తిగత ప్రైవసీకి సంబంధించిన విషయం. నా రూమ్ లో నాకు ప్రైవసీ లేకపోతే ఇంక ఎక్కడ ఉంటుంది. దయచేసి వ్యక్తిగత ప్రైవసీ అందరికీ ఉంటుందని తెలుసుకోండి. దాన్ని గౌరవించండి.. మమ్మల్ని ఆట వస్తువులుగా, వినోద పరికరాల్లా ట్రీట్ చేయకండి.. ప్రైవసీకి ఇబ్బంది కలిగించే ఇలాంటి వీడియోలు వద్దు….. అంటూ విరాట్ కోహ్లీ ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ చేశాడు.

ఇది నిజంగా చెత్తగా ఉంది.. అనుష్కశర్మ ఫైర్

దీనిపై విరాట్ భార్య అనుష్క సైతం స్పందించింది. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కూడా కొంత మంది అభిమానులు ఇలాంటి దారుణమైన ఘటనలకు పాల్పడ్డారని తెలిపింది. ఇది నిజంగా చెత్త పని అని అభివర్ణించింది. ఇలాంటి ఘటన మీ బెడ్ రూమ్ లో జరిగితే ఏం చేస్తారంటూ ప్రశ్నించింది అనుష్క శర్మ. ఈ తరహా చర్యలు ఏ మాత్రం సమంజసం కాదని హితవు పలికింది.

మరోవైపు విరాట్ కోహ్లీ రూమ్ వీడియో లీక్ పై సర్వత్రా చర్చనీయాంశమైంది. క్రికెటర్ల భద్రత విషయంలో సందేహాలు తలెత్తేలా ఉన్నాయంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. హోటల్ రూమ్ లోకే నేరుగా అభిమానులు ఇలా వచ్చేస్తే.. వ్యక్తిగత భద్రత ఎలా ఉంటుందని మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -