Anushka Shetty: హీరోయిన్ అనుష్క పెళ్లి చేసుకోబోయే వ్యక్తి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే?

Anushka Shetty: టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల తార అనుష్క శెట్టి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తన అందం, అభినయంతో టాలీవుడ్ లో పలు సినిమా అవకాశాలు అందుకుంటూ తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు తన సొంతం చేసుకుంది. ఇక అనుష్క తన అందంతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది.

అంతేకాకుండా భారీ స్థాయిలో సినిమా అవకాశాలు అందుకొని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ చెరగని ముద్రను సంపాదించుకుంది. మొదట గ్లామర్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనుష్క ఆ తర్వాత పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటిస్తూ నటిగా తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ఈ నేపథ్యంలో అరుంధతి సినిమాలో అనుష్క ప్రధాన పాత్ర పోషించి ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది.

ఆ సినిమాతో వరుస ఆఫర్లను తన సొంతం చేసుకుంటూ నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతూ వస్తుంది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో అనుష్క స్టార్ హోదా మరో స్థాయిలో మారిపోయింది. ఇక అనుష్క కెరీర్ పరంగా మంచి రేంజ్ లో దూసుకుపోగా.. ప్రస్తుతం అంతగా అవకాశాలు అందుకోలేక పోతుంది. అంతేకాకుండా పెళ్లి విషయంలో మాత్రం పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ క్రమంలో అనుష్క పెళ్లి గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హడావిడి చేస్తూనే ఉంటాయి.

ఇక తాజాగా అనుష్క పెళ్లి గురించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అనుష్క త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట. తెలంగాణా కు చెందిన ఒక వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లికి సిద్ధమైందని తెలుస్తుంది. ఇక ఆ వ్యక్తి గోల్డ్ బిజినెస్ ఫేమస్ అట. ఇక త్వరలో వీళ్ళిద్దరికీ వివాహం చేయాలని ఇరు కుటుంబాలు అనుకున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది మొదటిలోనే వీరిద్దరి పెళ్లి జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా సాగుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -