AP CM Jagan: ఉద్యోగుల కోసం ఏపీ సీఎం జగన్ షాకింగ్ ప్లాన్.. ఏం జరిగిందంటే?

AP CM Jagan: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మాస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీసి ప్రజలను తన వైపుకు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనె ప్రజలను తనవైపు తిప్పుకోవడానికి తాజాగా మరొక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నాడు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ ఏర్పాటు చేయడం గురించి కసరత్తు చేస్తున్నట్టుగా ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. కొత్త పీఆర్సీని ఈ ఏడాది జులై నుంచి ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది.

సాధారణంగా ప్రభుత్వాలు పీఆర్సీను ఇంప్లిమెంట్ చేయాల్సిన గడువు మీరిపోయినా సరే సుదీర్ఘకాలం పాటు అసలు కమిషన్ ఏర్పాటు చేయడంలోనే జాగు చేస్తుంటాయి. కానీ ఈసారి జగన్ సర్కారు గడువు కంటె ముందుగానే పీఆర్సీ కమిటీ వేయడానికి కసరత్తు చేస్తోంది. ఈ కసరత్తు ఉద్యోగుల్లో సానుకూల పవనాలు క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తునారు. గత పీఆర్సీ సిఫారసులను అమలు చేయడంలో వచ్చిన విభేదాలు కావచ్చు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను తిరిగి అమల్లోకి తెస్తానన్న మాటను జగన్ నిలబెట్టుకోలేకపోవడం వల్ల కావచ్చు. కారణాలు ఏమైనా కానీ ఉద్యోగ వర్గాల జగన్ సర్కారు పట్ల ఒక వ్యతిరేకత ఏర్పడిన మాట నిజం.

 

వారిలోను వ్యతిరేకతను దూరం చేసి, తిరిగి తన పట్ల ప్రసన్నులుగా మార్చుకునే లక్ష్యంతోనే ఇప్పుడు పీఆర్సీ కసరత్తు జరుగుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. కమిషన్ ను ఇప్పుడే ఏర్పాటు చేసేసి కొన్ని నెలల తర్వాత సరిగ్గా ఎన్నికలకు ముందు వారి నివేదికను తీసుకుని కొత్త జీతాల పెంపును ప్రకటించినా చాలు. ఒక్కసారిగా ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతాయి. జగన్ పట్ల ఈ నాలుగేళ్లలో కలిగిన వ్యతిరేక అభిప్రాయాలను వారు చిటికెలో మరచిపోగలరు. ఒకసారి వ్యతిరేకత తొలగిపోయాక మిగిలిన సమాజానికి జగన్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు అన్నీ కూడా వారికి పాజిటివ్ దృక్కోణంలోనే కనిపిస్తాయి.

అలా ఎన్నికల వేళకు, కీలకమైన ఉద్యోగ వర్గాల్లో పాజిటివిటీ ఏర్పడుతుందని జగన్ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -