YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ పరువు గోవింద.. అలాంటి కార్యక్రమం అవసరమా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం జగనన్నకు చెబుదాం అనే ఒకసారి కొత్త కార్యక్రమాన్ని మొదలు పెడతాము అని తెలిపారు. ఈనెల 16వ తేదీన మొదలు పెడతామని ముందుగానే ప్రకటించినప్పటికీ ఆ విషయాన్ని మరిచిపోయారు. ఈ విషయం గురించి ఏపీలోని ప్రజలు జగన్ టార్గెట్ చేస్తూ ఏకీపారేయడంతో తాజాగా ఈ విషయం గురించి మరికొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మే 9 నుంచి ఏపీ సర్కార్ జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కాల్ సెంటర్ల ద్వారా ప్రజల సమస్యలను ఎవరు తెలుసుకుంటారు ఎవరు పరిష్కరిస్తారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇప్పటికే ప్రతి వారం స్పందన కార్యక్రమంలో ప్రజల సమస్యలను పరిష్కరించే దిక్కులేదు. గ్రామ స‌చివాల‌యాలు, త‌హ‌శీల్దార్‌, ఆర్డీవో, క‌లెక్ట‌ర్ కార్యాల‌యాల చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్న కూడా పరిష్కారం చేయకపోగా కనీసం అధికారులు పట్టించుకోవడం లేదు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో జగనన్నకు చెబుదాం అనే కొత్త కార్యక్రమం తీసుకొస్తున్నారని చెబుతున్నారు ఇది వినడానికి చెప్పుకోడానికి బాగానే ఉంది కానీ ఆచరణకు వచ్చే సరికి కథ మొత్తం అడ్డం తిరుగుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆరు నెల‌ల క్రితం వైసీపీ సోష‌ల్ మీడియా టీమ్‌ని కొత్తగా ఏర్పాటు చేశారు.

 

ఈ సంద‌ర్భంగా టీమ్ జ‌గ‌న‌న్న పేరుతో మొబైల్ యాప్‌ను తీసుకొచ్చారు. ఇందులో నేరుగా జ‌గ‌న‌న్న‌తో నేరుగా మాట్లాడండి అంటూ ప్ర‌త్యేక ఆప్ష‌న్ ఇచ్చారు. ఇక్క‌డ చేర‌వేసే విష‌యాలు నేరుగా సీఎం జ‌గ‌న్ డాష్ బోర్డులోకి వెళ్తాయ‌ని, వెంట‌నే ఆయ‌న రియాక్ట్ అవుతార‌ని గొప్ప‌లు చెప్పారు. ఇంత వ‌ర‌కూ టీమ్ జ‌గ‌న‌న్ యాప్ ద్వారా జ‌గ‌న్‌తో నేరుగా ఎంత మంది ఇంట‌రాక్ట్ అయ్యారు? వారికి సీఎం ఇచ్చిన స‌మాధానం ఏంటో చెప్ప‌గ‌ల‌రా? చెప్ప‌లేరు. ఎందుకంటే కేవ‌లం జ‌గ‌న్‌కు చెప్పుకునేందుకు కొంద‌రు షో చేయ‌డం త‌ప్ప‌, పొడిచేదేమీ లేదన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

 

కాబట్టి ఇప్పుడు జగన్ మళ్ళీ కొత్త కార్యక్రమం మొదలుపెట్టి అనవసరంగా పరువు తీసుకోవడం తప్ప ఒరిగేదేమీ లేదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం వల్ల జగన్ పరువు మరోసారి తానే తీసుకున్నట్టు అవుతుంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. మరి జగన్ ఆ కాల్ సెంటర్ కార్యక్రమాన్ని మొదలు పెడతారా లేదంటే ఆ ఆలోచనని మానుకుంటారా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -