CM Jagan: జగన్ కు హెలికాఫ్టర్ల కోసం నాట్ సేఫ్ అనే ముద్ర వేశారా.. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రంలో ఉండడంటూ?

CM Jagan: ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో ఖర్చు చేస్తున్న ప్రతీ రూపాయికి నేను జవాబుదారీగా ఉంటానని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జగన్ చెప్పారు. అంతేకాదు.. ప్రజాధనం వృధా కానివ్వనని కూడా చెబుతూ నెలకు జీతంగా రూపాయి మాత్రమే తీసుకుంటానని ప్రకటించారు. అప్పుడు అదో సంచలన నిర్ణయంగా వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, జగన్ ప్రకటనలకు.. ఆచరణలకు ఏ మాత్రం పొంతన ఉండదు. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది అంటే.. సీఎంకు ఇకపై రెండు హెలికాఫ్టర్లు అవసరమట. ఒకటి విజయవాడలో.. మరొకటి విశాఖలో ఉండాలట. ఈ విషయాన్ని ఇంటిలిజెన్సీ డీజీ ఐపీఎస్ సీతారామాంజనేయులు చెప్పారు. రాష్ట్రంలో అరాచక శక్తులు పెరిగిపోయాయట. సీఎం సెక్యూరిటీకి సమస్య వస్తుందట. అందుకే.. సీఎం నేల మీద నడిస్తే ఆయన ప్రాణాలకే ముప్పు ఉందని.. గాల్లోనే తిరగాలని ఇంటిలిజెన్సీ డీజీ ప్రకటించారు.

అయితే, రాష్ట్రంలో అరాచక శక్తులు పెరిగిపోయాయంటే.. అది ఎవరి వైఫల్యమో చెప్పాలి? ఐదేళ్లుగా అధికారంలో ఉంటున్న వైసీపీ ప్రభుత్వానికి కాదా? అయినా.. రాష్ట్రంలో ఎక్కడా.. అల్లర్లు లేవు. రాష్ట్రం ప్రశాంతంగా ఉందని .. ఉగ్రకదలికలే లేవని డీజీపీ కేంద్రానికి లేఖరాశారు కదా? ఇప్పుడు ఎక్కడ నుంచి అరాచక శక్తులు పెరిగిపోయాయి? కర్నూల్ లో ఓ మత సంస్థకు చెందిన వారిని ఉగ్రవాద ముఠా సభ్యులుగా అనుమానించి అరెస్ట్ చేశారు. అయితే, వాళ్లు వైసీపీ సానుభూతిపరులుగా గుర్తించారు. వారెపుడూ కుట్రలు చేసినట్టు పోలీసులు గుర్తించలేదు. మరి ఒక్కసారిగా రాష్ట్రంలోకి అరాచక శక్తులు ఎలా వచ్చాయి? దీనికి ఇంటిలెజెన్సీ డీజీ సమాధానం చెప్పాలి. సీఎం జగన్ కు నక్సలైట్ల నుంచి ముప్పు ఉందని ఇంటెలిజెన్సీ వార్గాలు ప్రకటించాయి. హెలికాప్టార్లు అద్దెకు తీసుకొని ఒకటి గన్నవరం విమానాశ్రయంలో.. మరొకటి విశాఖ విమానాశ్రయంలో పెడితే ముప్పు తగ్గుతుందని చెప్పారు.

ప్రజల సొమ్మును ఎలా వృధా చేయాలో ఏపీ సీఎంకు తెలిసినంతగా ఇంకా ఎవరికీ తెలియదు. రూపాయి జీతం అని ప్రకటించడం మినహా ఆయన ఆధా చేసిన ప్రజాసొమ్ము లేదు. పేరుకు రూపాయి జీతం అని చెప్పారు. కానీ, ఎంత తీసుకుంటున్నారో సామాన్యుడికి తెలుసా? నిజంగా ప్రజాధనాన్ని కాపడే నాయకుడే అయితే.. ప్రజాభవన్ ను ఎందుకు కూల్చివేస్తారు? దాన్ని మరో అవసరానికి వినియోగించవచ్చు కదా? ప్రజా అవసరాల కోసం వినియోగించవచ్చు కదా? నిజంగా ప్రజాధానానికి కాపలా కాసేవాడే అయితే.. తాడేపల్లిలో తన ఇంటి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ తో వెళ్తారా? హెలికాప్టర్ సొంత డబ్బుతో తెచ్చి పెట్టుకున్నారా? ప్రజల సొమ్మే కదా? జగన్ కోసం ఖర్చు చేస్తున్న ప్రతీ రూపాయి కూడా ఎన్నికల ఖర్చే. ఎందుకంటే.. ప్రభుత్వ మీటింగులకు, సభలకు భారీగా ఖర్చు చేస్తున్నారు. కానీ, అక్కడికి వెళ్లిన జగన్ ఆ కార్యక్రమం గురించి కాకుండా.. ప్రతిపక్షాల గురించే మాట్లాడుతారు? జగన్ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ మీటింగులకు, పార్టీ మీటింగులకు తేడా లేకుండా పోయింది. ఎన్నికల సభలను తలపించే సభలకు కూడా ప్రజల సొమ్మే. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి రెండు హెలికాఫ్టర్లు కావాలని మరో ప్రతిపాధన.

Related Articles

ట్రేండింగ్

Nandamuri Balakrishna: మాటల తూటాలు పేల్చిన బాలయ్య.. కర్నూలులో పంచ్ డైలాగ్స్ తో రేంజ్ పెంచాడుగా!

Nandamuri Balakrishna: టీడీపీ సీనియర్ నాయకుడు హిందూపురం ఎంపీ నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఈ యాత్ర కూటమి పార్టీల తరఫున చేస్తున్నారు. యాత్రలో...
- Advertisement -
- Advertisement -