Bigg Boss Season 6: బిగ్ బాస్ 6 షో పై హైకోర్టు ఆగ్రహం.. ఇంతకు ఏం జరిగిందంటే?

Bigg Boss Season 6: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ బాస్ షో గురించి పెద్దగా పరిచయంకర్లేదు. ఎక్కడో బాలీవుడ్లో మొదలైన ఈ షో తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంటుంది. కాగా గణనీయంగా ఈ షో ఐదు సీజన్లు పూర్తిచేసుకుంది. ఇక ఆరో సీజన్ తో ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ షో హోస్ట్ నాగార్జున కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాడు.

ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ మాత్రం మునిపటి సీజన్ల కంటే చాలా భిన్నంగా సాగుతుంది. హౌస్ లో కంటెస్టెంట్లు విపరీతంగా రోత పుట్టిస్తున్నారని కొందరు కామెంట్లు రూపంలో కడిగిపారేస్తున్నారు. అయితే ఈ షో అశ్లీల‌త‌తో కూడిందని ఈ షో ని వెంటనే నిషేధించాలని చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఐదు సీజన్స్ గణనీయంగానే పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఆరో సీజన్ మాత్రం కొంతమందికి ఎగుటుగా అనిపిస్తుంది. ఆరో ఎపిసోడ్ చాలా దారుణంగా ఉందంటూ కొందరు ఆరోపిస్తున్నారు.

ఇక ఈ షో అశ్లీల‌త‌తో నడుస్తుంది అని హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై విచారణ కూడా జరిపింది. పిటిషనర్ తరపున న్యాయవాది శివప్రసాద్ రెడ్డి.. ఐబిఎఫ్ మార్గదర్శకాలు అసలు పాటించడం లేదని, చాలా నిర్లక్ష్యం చేస్తున్నారని వివరించాడు. ఈ విషయంలో కొంచెం హైకోర్టు కూడా కోపం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కేంద్రం తరపున న్యాయవాది దీని గురించి స్పందించేందుకు కొంత సమయం కావాలని కోరారు.

ప్రతివాదులకు నోటీసుల విషయాన్ని తదుపరి వాయిదాలో తెలియజేస్తామని హైకోర్టు వెల్లడించింది. విచారణను అక్టోబర్ 11 వరకు హైకోర్టు వాయిదా వేసింది. ఏదైనా మిగతా సీజన్ల కంటే ఆరో సీజన్ చాలా ఓవర్ గా అనిపిస్తున్నట్లు కొంతమంది అనుకుంటున్నారు. అసలు బిగ్ బాస్ షో కూడా గతంలో మాదిరిగా ఏమాత్రం జెన్యూన్ గా సాగడం లేదని నెటిజన్లు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. మరి అక్టోబర్ 11న సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -