Harish Rao: హరీష్ రావు వర్సెస్ ఏపీ మంత్రులు.. తెలుగు రాజకీయాల్లో తీవ్ర దుమారం

Harish Rao: తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆర్ధికశాఖ మంత్రిగా కీలక బాధ్యతలతో పాటు టీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయనకు నేతలతో టచ్ లో ఉంది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఆయనకు మంచి పేరు ఉంది. ఒకప్పుడు కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్, ప్రభుత్వంలో నెంబర్ 2 గా ఆయన ఉండేవారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం, పార్టీలో కేటీఆర్ బాగా యాక్టివ్ కావడంతో ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుతం టీఆర్ఎస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. ఇక ప్రభుత్వంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పటికీ మంత్రి కేటీఆర్ నే అన్నీ నడిపిస్తున్నారు.

డీఫ్యాక్టో సీఎంగా మంత్రి కేటీఆర్ ప్రభుత్వంలో ఉున్నారు. అయినా టీఆర్ఎస్ కార్యకర్తల్లో, ప్రభుత్వంలో హరీష్ రావుకు పాపులర్ లీడర్ గానే ఉన్నారు. అయితే ఏపీ ప్రభుత్వంపై హరీష్ చేసే కామెుంట్స్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుత ఉంటాయి. గతంలో చాలాసార్లు ఆయన ఏపీని తెలంగాణతో ముడిపెడుతూ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అంశంలో, పరిపాలన విషయంలో ఇలా ప్రతి విషయంలో ఏపీ, తెలంగాణను ముడిపెడుతూ వ్యాఖ్యలు చేశారు. గత ఏపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో పోరాటం సాగింది. ఆ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయంశమయ్యాయి.

ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో ఇసుకు కొరత, రాజధాని మార్పు అంశం వల్ల అక్కడ ఎవరూ పెట్టుబడులు పెట్టడం లేదని, దాని వల్ల తెలంగాణకు లాభం జరుగుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. రాజధాని గొడవ వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిందంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఇటీవల మరోసారి ఏపీలోని పాలనపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్నాయి. ఇటీవల తాను తిరుపతి వెళ్లినప్పుడు అనంతపురంకి చెందిన కొంతమంది వ్యక్తులతో మాట్లాడానని, కరెంట్ ఎన్ని గంటలు ఉంటుందో అడిగినట్లు తెలిపారు.

కరెంట్ ఎప్పుడో వస్తదో.. ఎప్పుడు పోతదో తెలియదని ప్రజలు చెప్పారని, రోజుకు ఐదు, ఆరు గంటల కంటే ఎక్కువ సేపు కరెంట్ ఉండటం లేదని చెప్పినట్లు హరీశ్ తెలిపారు. కానీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటలు ఉంటుందంటూ ఏపీతో ముడిపెట్టారు. దీంతో హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని పరిస్థితుల గురించి హరీశ్ కు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. హరీశ్ వ్యాఖ్యలు అర్ధరహితమని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్ రావు విమర్శలను టీఆర్ఎస్ విమర్శలుగా తాము చూడమన్నారు. హరీశ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తెలిపారు.

ఇక ఆయనకు, కేసీఆర్ కు మధ్య ఏవైనా విబేధాలు ఉంటే చూసుకోవాలని, తమతో ఆయనకు ఎందుకకుని సజ్జల ప్రశ్నించారు. మధ్యలో మమ్మల్నిలాగడం ఎందుకని సీరియస్ అయ్యాయరు. ఇక హరీష్ రావు కేసీఆర్ మనిషా లేదా రామోజీరావు మనిషా అంటూ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఫైర్ అయ్యారు. దీంతో హరీష్ రావు, ఏపీ మంత్రుల మధ్య దుమారం రేగుతోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -