AP Politics: వైసీపీకి బిగ్ షాక్.. జనసేనలోకి ఏడుగురు ఎమ్మెల్యేలు?

AP Politics: ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగా.. ఇప్పటినుంచే ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటినుంచే రాజకీయాలు వేడెక్కుతోన్నాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్లే ఆలోచనను సీఎం జగన్ చేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. వచ్చే ఎన్నికలకు తమ పార్టీని రెడీ చేసే పనిలో పడ్డాయి. సీఎం జగన్ నియోజకర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ నేతలను ఎన్నికలకు సిద్దం చేస్తోండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాజకీయంగా స్పీడ్ పెంచారు.

 

గత ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటకట్టుకున్న చంద్రబాబు.. ఈ సారి జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తనవైపు తిప్పకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఇక పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా, ప్రజావాణి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. ఇక జనవరి నుంచి బస్సు యాత్రకు పవన్ కల్యాణ్ సిద్దమవుతోన్నారు. అటు లోకేష్ కూడా జనవరి నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశముంది. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని లోకేష్ ఇప్పటికే నిర్ణయించుకున్నారు.

 

అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ నేతలు కూడా సీటు కోసం ప్రయత్నాలు చేస్తోన్నారు. వైసీపీలో సీటు దక్కదనుకున్న ఏడుగురు ఎమ్మెల్యేలు జనసేనలో చేరేందుకు సిద్దమవుతోన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో ఉభయ గోదావరి జిల్లాల నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. విశాఖ నుంచి ఒక ఎమ్మెల్యే, విజయనగరం నుంచి ఒక ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా నుంచి మరో ఎమ్మెల్యే ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. వైసీపీలో తమకు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కడం కష్టమనే భావనలో ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, అందుకే జనసేనలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్దం చేసుకున్నారనే వార్తలు వినిపిస్తోన్నాయి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -