Brahmini: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైసిపి మంత్రులను ఉద్దేశిస్తూ మూడు పెళ్లిళ్లు గురించి చేసినటువంటి కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. మూడు పెళ్లిళ్లు మీరు కూడా చేసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడటంతో ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మజ తాను మూడు పెళ్లిళ్లు చేసుకోవాలనే మాటను వెనక్కి తీసుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది.
ఈ క్రమంలోనే ఈ విషయంపై ఎంతోమంది వాసిరెడ్డి పద్మజ పై ప్రశంసల కురిపించగా మరికొందరు మాత్రం ఈమె వైసిపి పార్టీకి కొమ్ము కాస్తుందని మండి పడుతున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు లోకేష్ భార్య, బాలయ్య కూతురు బ్రాహ్మిని పట్ల ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఓ అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మహిళలను కించపరిచే హక్కు మహిళా కమిషన్ కి ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఒక బాధ్యత గల పదవిలో ఉంటూ ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి నాయకులు వారి ఇంట్లో ఉండే మహిళలపై సోషల్ మీడియా వేదికగా ఈ విధమైనటువంటి అభ్యంతర పోస్టులు చేయడం ఎంతవరకు సమంజసం? ఇలా కమిషన్ సభ్యురాలు చేసినటువంటి అభ్యంతరకర పోస్ట్ వాసిరెడ్డి పద్మజా గారికి తెలియదా? తెలిసి చూస్తూ ఉన్నారా అంటూ ఎంతోమంది గజ్జల లక్ష్మి చేసిన పోస్ట్ పట్ల వాసిరెడ్డి పద్మజను కూడా నిలదీస్తున్నారు.ఇంతకీ గజ్జల లక్ష్మి బ్రాహ్మినిని ఉద్దేశించి ఎలాంటి పోస్ట్ చేశారు అనే విషయాన్ని వస్తే..
గజ్జల లక్ష్మి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చంద్రబాబు నాయుడు పరామర్శ పరంపరలో భాగంగా ఫన్ కళ్యాణ్ పైన అత్యాచారం చేశారా? ఎవరైనా మరి ఇంద్రబాబు నాయుడు ఎందుకు పరామర్శకు వెళ్ళాడు? గతంలో రాహుల్ గాంధీ పార్క్ హయత్లో ఉంటే కోడల్ని ఒంటరిగా పంపాడు రాజకీయ అవసరాలకి. ఇప్పుడు ఫన్ కళ్యాణ్ ను ఒంటరిగా కలిశాడు. మొత్తానికి కలవడం అన్నది కామనే. ఎట్టకేలకు దత్తపుత్రుడిని చేరుకున్న దత్తతండ్రి !అన్నమాట సార్థకం చేసుకున్నాడు” అంటూ ఈమె చేస్తున్నటువంటి పోస్టులు బ్రాహ్మిని ఎంతో అవమానకరంగా మాట్లాడటమే కాకుండా ఆమెపై చెత్త కామెంట్లు చేయడం ఏంటి అంటూ ఎంతోమంది వాసిరెడ్డి పద్మజను కూడా ఈ విషయంపై నిలదీస్తున్నారు.మరి ఈ విషయానికి వాసిరెడ్డి పద్మజ ఎలాంటి సమాధానం చెబుతారో తెలియాల్సి ఉంది.