YS Sharmila: నవ సందేహాల పేరుతో జగన్ కు లేఖ రాసిన షర్మిల.. ఏకు మేకులా గుచ్చుకుంటోందా?

YS Sharmila:  వైయస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ ప్రచార కార్యక్రమాలలోను అలాగే పార్టీ వ్యవహార కార్యక్రమాలలో కూడా ఎంతో బిజీగా మారిపోయారు. ఈ విధంగా వైఎస్ షర్మిల పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా అధికార ప్రభుత్వమైనటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత తన సొంత అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో దొంగ హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చలేకపోయారని తెలిపారు. అయితే తాజాగా ఈమె నవ సందేహాలు అంటూ తన అన్నయ్య ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అంటూ ఆమె కోరారు.

ఈ లేఖలో భాగంగా ఎస్సీ ఎస్టీ ఉపప్రణాళిక సంఘం నిధులను దారి మళ్లించడం నిజం కాదా? సాగు భూమి నిత్య కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? 28 పథకాలను ఎందుకు అర్ధాంతరంగా ఆపివేశారు? ఎస్సీ ఎస్టీలకు పునరావాసం ఎందుకు నిలిచిపోయింది? విదేశీ విద్య పథకంలో అంబేద్కర్ గారి పేరును ఎందుకు తొలగించారని ఈమె ప్రశ్నించారు.

ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఎందుకు టికెట్లు నిరాకరించారు? రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పై దాడులు పెరిగాయి అది మీ వివక్ష కాదా,? డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీకి ఎందుకు సమర్థిస్తున్నారు? స్టడీ సర్కిల్ లకు నిధులు ఇవ్వకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటూ ఈమె జగన్ మోహన్ రెడ్డిని ఏకంగా నవ సందేహాలు పేరిట ప్రశ్నిస్తూ ఆయన ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని బహిరంగంగా లేఖ రాశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -