AP:మా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న మాట నిజమే.. బిగ్ బాంబ్ పేల్చిన ఏపీ మంత్రి

AP: ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమేనంటూ బిగ్ బాంబ్ పేల్చారు. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్మాన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోన్నాయి. సొంత పార్టీ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాలు, వైసీపీలో పెద్ద దుమారం రేపుతోన్నాయి. ప్రభుత్వం చేపడుతోన్న కొన్ని కార్యక్రమాలను కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు మీడియా వేదికగా బహిరంగంగా చెప్పడం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

 

 

శ్రీకాకుళం పీఎస్ కాలనీలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సంస్కరణలపై తొలినాళ్లల్లో వ్యతిరేకత రావడం సాధారణమేనని, ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్పులను ప్రజలు అర్థం చేసుకోకపోవడమే దీనికంతటికి కారణమని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పలువురు రోడ్ల పరిస్ధితిపై మంత్రిని నిలదీశారు.

 

 

 

ప్రస్తుతం రోడ్లపై ఏర్పడిన గుంతలు గత ప్రభుత్వంలో ఏర్పడినవేనని, తాము ఏమైనా రోడ్లకు కన్నాలు వేశామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రోడ్లకు ఏర్పడిన గుంతలు ఇప్పుడు పెద్దగా అయ్యాయని ధర్మాన తెలిపారు. గత ప్రభుత్వం ఎలా పడితే అలా నాసిరకంగా పారదర్శకత లేకుండా రోడ్లు వేసిందని, అందుకే గుంతలు ఏర్పడ్డాయని ఆరోపించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎక్కడైనా గుంతల రోడ్లు ఉంటే చూపించాలని మంత్రి ధర్మాన సవాల్ విసిరారు.

 

 

అయితే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ధర్మాన స్వపక్షంలో విపక్షంలా తయారయ్యారని, సొంత ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని వైసీపీ నేతలు, కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

AP Electricity: ఏపీలో విద్యుత్ కోతలు మొదలు.. పవర్ కట్ వల్ల జగన్ పవర్ కట్ అయ్యే ఛాన్స్ ఉందా?

AP Electricity: ఏపీలో కరెంటు కోతలు అనే మాట ఓ తరానికి ముందు విన్నాం. ఇప్పుడు అలాంటి మాట వినాల్సిన పని లేదనే అనుకుంటాం. పైగా రాష్ట్ర విభజన తర్వాత కరెంటు కోతలు...
- Advertisement -
- Advertisement -