Apple Iphone 14: త్వరలోనే రానున్న ఐఫోన్ 14.. ప్రత్యేకతలు, ధర తెలిస్తే షాక్!

Apple Iphone 14: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది ఐఫోన్ 13 సక్సెసర్ గా ఈ కొత్త సిరీస్ రాబోతోంది. అయితే ఈ సిరీస్‌లో ఐఫోన్ 14, అలాగే ఐఫోన్ 14 మ్యాక్స్ ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ రాబోతున్నాయట. అయితే ఈసారి మినీ కాకుండా మ్యాక్స్ ఫోన్‌ను తీసుకురానుంది యాపిల్ సంస్థ. మామూలుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో యాపిల్ కొత్త ఐఫోన్ సిరీస్ నూ లాంచ్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏడాది లాగే ఈ ఏడాది కూడా అదే సాంప్రదాయాన్ని పాటించండి యాపిల్.

అయితే సెప్టెంబర్ లో ఏ రోజున ఈ ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ కానుంది అన్న విషయం తాజాగా లీక్ అయ్యింది. ఈ యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ వచ్చే నెల అనగా సెప్టెంబర్ 7వ తేదీన లాంచ్ కానుందని సమాచారం. అయితే ఈ లాంచ్ ఈవెంట్ ను యాపిల్ వర్చువల్ గానే నిర్వహిస్తుంది అని అంచనా వేస్తున్నారు. కాదా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ అని ప్రదేశాలలో కరోనా వైరస్ ప్రభావం మరింత వ్యాప్తి చెందుతుండడంతో ఈ ఏడాది కూడా లాంచ్ ఈవెంట్‌ను ఆన్‌లైన్ ఓన్లీగానే యాపిల్ నిర్వహిస్తుందట. సెప్టెంబర్ 7న లాంచ్ కాలుండగా,సెప్టెంబర్ 16వ తేదీ నుండి ఈ ఐఫోన్ 14 మొబైల్స్ సేల్స్ మొదలవుతుందట.

కాగా ఈసారి ఐఫోన్ 14 సిరీస్ లో నాలుగు సరికొత్త మోడల్స్ లాంచ్ కాబోతున్నాయి. మినీ స్థానంలో మ్యాక్స్ మోడల్‌ను యాపిల్ తీసుకొస్తుందట. ఈ సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మొబైళ్లు లాంచ్ కానున్నాయి. కాగా ఈ ఐఫోన్ 14 సిరీస్‌లో రెండు మొబైల్స్ 6.1 ఇంచుల డిస్‌ప్లే, మరో రెండు మోడళ్లు 6.7 ఇంచుల డిస్‌ప్లే కాగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్ మొబైళ్లలో ఇప్పటికే ఉన్న ఏ15 బయోనిక్ చిప్ ఉండనుండగా, ఐఫోన్ 14 ప్రో,14 ప్రో మ్యాక్స్‌లో లేటెస్ట్ ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌‌ను యాపిల్ ఉండనుందట. ప్రో మోడల్స్ బ్యాక్ సైడ్ కెమెరా 48 మెగాపిక్సెల్ సామర్థ్యంతో, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కెమెరాలు ఉంటాయని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Minister Roja: నాడు అప్పులు నేడు కోట్ల రూపాయల ఆస్తులు.. ఆ పనులు చేసి రోజా కోట్లు సంపాదించారా?

Minister Roja: ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి నగరి ఎమ్మెల్యే రోజా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తైన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈసారి కూడా తనను గెలిపించే...
- Advertisement -
- Advertisement -