Apple Tea: యాపిల్‌టీ తాగితే ఆ రోగాలు దరిచేరవట!

Apple Tea: ప్రస్తుత కాలంలో పౌష్టికాహారం తీసుకుంటున్నా అనారోగ్యాలకు గురవుతూనే ఉంటారు. తమ తమ ఆరోగ్యాలను కాపాడుకునేందుకు వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తుంటారు. అనారోగ్యాలకు గురైతే ఆహారం తినాలనిపించదు. కాబట్టి ఎక్కువగా పండ్లను తింటుంటారు. అందులో ఎక్కువగా యాపిల్‌ పండ్లకు ఆసక్తి చూపుతారు. వైద్యులు కూడా యాపిల్‌ పండ్లనే తినాలని సూచిస్తుంటారు.

యాపిల్‌ పండ్లు తింటే ఆరోగ్యంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మరి కొందరు యాపిల్‌ జ్యూస్‌లను తాగుతుంటారు. అయితే.. యాపిల్‌ పండ్లు, జ్యూస్‌తో పాటు యాపిల్‌ టీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతోందని నిపుణులు సూచిస్తుంటారు. ప్రతి రోజూ యాపిల్‌ టీ తాగితే ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు.

బరువు తగ్గడానికి గ్రీన్‌ టీ ఎంతో మేలు చేస్తోందో అంత కన్నా ఎక్కువ యాపిల్‌ టీ చేస్తోందట. యాపిల్‌ టీ ఫిట్‌నెస్‌తోపాటు శరీరబరువును కూడా అదుపులో ఉంచడానికి దోహదపడుతుందట. రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాక ఉదర సంబంధ సమస్యలన్నింటికీ యాపిల్‌ టీ చక్కటి ఔషధంలా పని చేస్తుంది. జాయింట్‌ పెయిన్‌ సమస్యలకు యాపిల్‌ టీ తాగితే ఉపశమనం కలిగిస్తోందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాక చర్మం సౌందర్యానికి కూడా యాపిల్‌ టీ ఎంతో ఉపయోగపడుతుదంటున్నారు నిపుణులు.

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -