Arakalagud: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే.. స్పెషల్ క్లాస్ పేరుతో అలాంటి పనులు?

Arakalagud: ఈ మధ్యకాలంలో చాలామంది గురువులు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సింది పోయి గాడి తప్పి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇంకా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. విద్యాబుద్ధులను నేర్పించాల్సిన కొంతమంది గురువులు కామాంధులుగా మారి విద్యార్థుపట్ల అసభ్యంగా ప్రవర్తించడం వారిని లైంగిక వేధింపులకు గురి చేయడం లాంటివి చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

 

కర్ణాటక హసన్ జిల్లా అరకలగూడు ప్రాంతంలో ఒక పాఠశాలలో శివకుమార్ అనే వ్యక్తి హెడ్ మాస్టార్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఉన్నత చదువులు పూర్తి చేసిన ఈ విద్యావంతుడు రాను రాను బుద్ధి మార్చుకుని ఒక కామాంధుడిలా మారిపోయాడు. అంతటితో ఆగకుండా స్కూల్ లో అందమైన బాలికపై కన్నేయడం, వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం లాంటివి చేసేవాడు. అంతే కాకుండా ఈ దుర్మార్గుడు స్కూల్లో కొంతమంది విద్యార్థినులను వరుసగా నిలబెట్టి అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా కూడా తెలుస్తోంది.

 

శివకుమార్ స్పెషల్ క్లాసులు అంటూ కొంతమంది విద్యార్థినులను క్లాసులకు పిలిచి ఆ బాలికలు వచ్చిన వెంటనే వారిపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం, లైంగికంగా వేధించడం వంటివి చేసేవాడు. అలా ఆ విద్యార్థినులు శివకుమార్ వేధింపులను భరిస్తూనే వస్తున్నారు. ఇక అతని ఆగడాలు వేధింపులు మరింత ఎక్కువ అవ్వడంతో తట్టుకోలేక పోయారు. దీంతో విద్యార్థులు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు శివకుమార్ ని అరెస్టు చేశారు. అనంతరం అతనిపై ఫోక్సొ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకివచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో సునీతకు వరుస షాకులు.. ఏం జరిగిందంటే?

Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్ళకూడదని, సీబీఐ విచారణకు...
- Advertisement -
- Advertisement -