Chiranjeevi-Ram Charan: పవన్ గెలుపు కోసం చిరంజీవి, చరణ్ అలా చేయబోతున్నారా?

Chiranjeevi-Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రభావశీల కుటుంబాల జాబితాలో మెగా కుటుంబం ఒకటి. అయితే ఆ కుటుంబానికి చెందిన వాళ్లు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా, రాజకీయాల్లో కూడా ఉంటున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి సొంతం పార్టీ పెట్టి, దానిని కాంగ్రెస్ లో విలీనం చేసి టూరిజం శాఖ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం జనసేన పేరుతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీని స్థాపించి, తెలుగు రాష్ట్రాల్లో ప్రభావశీల రాజకీయాలు చేస్తున్నారు.

 

మరీ ముఖ్యంగా ఏపీలో అధికార వైసీపీ పార్టీకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొరకరాని కొయ్యగా మారారు. ఈ ఎన్నికల్లో ఎట్టి స్థితిలోనూ జగన్ ను తిరిగి సీఎం కానివ్వను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరాకండిగా చెబుతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో వైసీపీ, జనసేనల మధ్య ఆసక్తికర పోటీ ఏర్పడనుంది. అయితే గత ఎన్నికల్లో జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన నియోజకవర్గాల్లో కూడా ఓడిపోయారు.

 

అయితే ఈ ఎన్నికల్లో మాత్రం అలాంటి ఫలితాలు రిపీట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ గతంలో మాదిరిగా ఒకటి కన్నా ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా? లేదంటే ఒకే నియోజకవర్గం మీద ఫోకస్ చేస్తారా? అనేది ఇంకా స్పష్టత రాలేదు. కానీ గాజువాక లేదంటే భీమవరం నియోజకవర్గం నుండి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి.

 

రాజకీయ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కు అండగా నిలవాలని మెగా కుటుంబానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి మరియు అతని కొడుకు రామ్ చరణ్ భావిస్తున్నారట. అందుకే పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసినా కానీ అక్కడికి వెళ్లి ప్రచారం చేయాలని చిరంజీవి, రామ్ చరణ్ లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కుటుంబంలో చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -