Jabardasth Sujatha: ఈ జబర్దస్త్ కమెడియన్లు పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నారా?

Jabardasth Sujatha: ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీ వాళ్లతోపాటుగా బుల్లితెరపై నటించే నటీనటులు కూడా అడ్వాన్స్ అయ్యారు. పెళ్లికి ముందే కలిసి జీవిస్తూ సమాజానికి కొత్త మెసేజ్ పంపిస్తున్నారు. బాలీవుడ్ లో చాలా మంది ముంబైలో కలిసి జీవిస్తుంటారు. తమిళ నటీనటులు, టాలీవుడ్ లో నటించిన చాలా మంది కూడా ముంబై చేరుకొని అక్కడ సహజీవనం చేస్తూ ఉంటారు.
హైదరాబాద్ లోనూ ఈ తరహా సంస్కృతి వ్యాపించింది. తాజాగా ఈ లిస్టులోకి బుల్లితెర జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్ చేరాడు. బిగ్ బాస్ బ్యూటీ సుజాతతో ప్రేమాయణంలో మునిగినట్లు వార్తలు వస్తున్నాయి. జబర్దస్త్ తో తనదైన శైలిలో కామెడీతో ఆకట్టుకుంటున్న రాకేష్.. తాజాగా జోర్దార్ సుజాతతో కలిసి స్కిట్స్ చేస్తున్నాడు. అసలైన భార్యాభర్తల మాదిరి ప్రవర్తిస్తూ పంచ్ లు వేస్తున్నాడు.
జబర్దస్త్ లో రష్మి- సుధీర్, ఇమ్యాన్యుయేల్-వర్ష జంటలకు ఎలాంటి పాపులర్ ఇమేజ్ వచ్చిందో.. వీళ్లకూ అదే తరహా వస్తోందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. దీంతో రాకేష్-సుజాత త్వరలో పెళ్లి చేసుకోబుతున్నారా అంటూ మిగతా జబర్దస్త్ కంటెస్టెంట్లు అడుగుతున్నారట. అలాంటి క్రేజీ ఫాలోయింగ్ ను ఈ జంట ఏర్పరచుకున్నారు.
మిస్టర్ అండ్ మిసెస్ షోలోనూ హవా..
రీసెంట్ గా రాకేష్, సుజాత జంట పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త వైరల్ అయ్యింది. మిస్టర్ అండ్ మిసెస్ షోలో కూడా ఇద్దరూ కపుల్ గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో వీరి పెళ్లి కచ్చితంగా జరుగుతుందని అనుకుంటున్నారు.  ఇటీవల రచ్చ రవి కొత్త కారు కొన్నాడు. ఈ నేపథ్యంలో రాకింగ్ రాకేష్  వద్దకు వెళ్లి అందరూ కలిసి ఓ సెల్ఫీ దిగా ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేశారు. ఇందులో రాకేష్ తో పాటు సుజాత కూడా ఉంది. పెళ్లికి ముందే కలిసి జీవిస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -