Unstoppable: జగన్ శత్రువులనే బాలయ్య అన్ స్టాపబుల్‌కు పిలుస్తున్నారా?

Unstoppable: టాలీవుడ్ టాప్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య.. తన కెరీర్‌లో మొదటిసారిగా ఓ టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ సీజన్ పూర్తి చేసుకుంది. సీజన్-2 ప్రారంభమై మూడు ఎపిసోడ్లు కూడా విజయవంతంగా ముగిసింది. మొదటి ఎపిసోడ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌ ముఖ్యఅతిథులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ మంచి హిట్ అయింది. ఆ తర్వాత యంగ్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ గెస్ట్ గా వచ్చారు. మూడో ఎపిసోడ్‌లో అడివి శేష్, శర్వానంద్ వచ్చి రచ్చ రచ్చ చేశారు. ఈ యంగ్ హీరోలతో జరిగిన రెండు ఎపిసోడ్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

 

అయితే తర్వాతి ఎపిసోడ్‌లో ఎవరు వస్తారనే విషయంపై ఉత్కంఠత నెలకొంది. ఈ సారి సినిమాతో సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు షోకు గెస్టులుగా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఒకరు మాజీ రాజకీయ నాయకుడైతే.. మరొకరు మాజీ క్రికెటర్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా రానున్నారు. ఆయనతోపాటు మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కూడా షోకు హాజరు కానున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. బాలయ్య బాబు ఒకప్పటి క్లాస్‌మేట్స్. అలాగే అజహరుద్దీన్ కూడా మిత్రుడే. కిరణ్ కుమార్ రెడ్డి, అజహరుద్దీన్ కలిసి దేశవాళీ క్రికెట్‌లో కలిసి ఆడారు.

 

 

కిరణ్ కుమార్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా పదవీకాలం ముగిశాక రాజకీయాల నుంచి దూరమయ్యారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయాక.. కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపించకుండా పోయింది. అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిపించినా.. కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి కనిపించనున్నారు. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అలాగే అజహరుద్దీన్ కూడా మ్యాచ్ ఫిక్సింగ్, హెచ్‌సీఏ గొడవలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరి సీక్రెట్‌ను బాలయ్య ఎలా ఇంట్రెస్టింగ్‌గా రివీల్ చేస్తారో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

News Arena India: మళ్లీ జగనే సీఎం.. మరో సంచలన సర్వే.. న్యూస్ ఎరేనా సర్వేలో వైసీపీ సీట్ల లెక్క ఇదే!

News Arena India: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఆ పార్టీ అధినేత జగన్ తనదైన సిద్దం సభలను మొదట నిర్వహించి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత...
- Advertisement -
- Advertisement -