Naresh: నరేష్ నాలుగో పెళ్లి గురించి నెటిజన్లు అలా కామెంట్లు చేస్తున్నారా?

Naresh: గత కొంతకాలం నుండి.. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటులు నరేష్, పవిత్ర ల ప్రేమ వ్యవహారం ఎలా చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికే నరేష్ కు మూడు పెళ్లిళ్లు కాగా.. పవిత్రకు కూడా అది వరకే ఒక వ్యక్తితో పెళ్లి జరిగింది. అయితే పవిత్ర అతనికి విడాకులు ఇవ్వగా.. నరేష్ మాత్రం తన మూడో భార్యకు విడాకులు ఇవ్వకుండానే నాల్గవ పెళ్లి చేసుకున్నాడు.

 

గతంలో నరేష్ బెంగళూరులో ఓ హోటల్ గదిలో పవిత్రత ఉండగా ఆ సమయంలో ఆయన భార్య రమ్య వచ్చి ఎంతలా గొడవ చేసిందో చూసాం. ఇక అప్పటినుంచి నరేష్, పవిత్రల వ్యవహారం బయటపడుతూనే ఉంది. ఇక వీరిద్దరు ప్రేమలో పడి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ వయసులో ప్రేమ ఏంటి అంటూ అందరూ దారుణంగా తిట్టి పోశారు.

 

ఇక ఆయన భార్య రమ్య మాత్రం వీరిని ఎన్నటికీ ఒకటి కానివ్వను అంటూ శపథం కూడా చేసింది. కానీ నరేష్ మాత్రం పవిత్రను పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది నరేష్, పవిత్ర.. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ ఒక లిప్ కిస్ వీడియోతో బాగా హల్ చల్ చేశారు. అయితే మొత్తానికి వీరిద్దరూ తాజాగా మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. అతి కొంత మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.

ఇక తన పెళ్లికి సంబంధించిన వీడియో నరేష్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్ళు.. ఏడు అడుగులు అంటూ పంచుకున్నాడు. ఇక అందరి ఆశీస్సులు కావాలి అంటూ కోరాడు. ఇక ప్రస్తుతం ఆ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో ఆ వీడియో చూసిచాలామంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ముసలోడికి దసరా పండుగ అంటూ కుర్రాళ్ళు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇక సింగిల్స్ మాత్రం.. వీడికి నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి కానీ మాకు ఒక్క పెళ్లి కూడా కాలేదు అంటూ ఫీల్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -