Pavitra-Naresh: పవిత్ర నరేశ్ బంధంలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా?

Pavitra-Naresh: సీనియర్ నటుడు నరేష్ గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో నరేష్, పవిత్రా లోకేష్ పెళ్లి గురించే చర్చ నడుస్తోంది. సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అయిన ప‌విత్రా లోకేష్‌తో నరేష్ నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. నూత‌న సంవ‌త్స‌రం సందర్భంగా న‌రేష్‌, ప‌విత్ర‌కు లిప్‌కిస్ ఇస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేశారు. దీంతో వీరిద్ద‌రు త్వరలోనే స‌రికొత్త వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

సీనియర్ నటుడు అయిన న‌రేష్‌కు ఇప్ప‌టికే మూడు పెళ్లిళ్లు జరిగాయి. ఆ పెళ్లిళ్ల గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. న‌రేష్‌కు ముందుగా ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ శ్రీనివాస్ కుమార్తెతో పెళ్లి అయ్యింది. అప్ప‌టికే టాలీవుడ్‌లో హీరోగా ప‌రిచ‌యం అయిన న‌వీన్ విజ‌య్‌కృష్ణ ఈ దంప‌తుల కుమారుడే కావడం విశేషం. ఈ పెళ్లి జ‌రిగేట‌ప్ప‌ట‌కి న‌రేష్ వ‌య‌స్సు కేవ‌లం 19 సంవత్సరాలు మాత్రమే. అయితే న‌రేష్ సినిమాల‌పై పూర్తిగా ఫోక‌స్ పెట్టి అప్పట్లో మంచి హీరోగా రాణించారు.

కెరీర్‌పై పూర్తిగా సమయం కేటాయించడంతో తన వ్య‌క్తిగ‌త జీవితానికి స‌రైన ప్రాధాన్యత ఇవ్వలేకపోయాడు. అందుకే మొద‌టి భార్య‌కు న‌రేష్ విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. తన మొదటి భార్యతో మనస్పర్ధలు ఏవీ లేవని, ఇప్పటికీ తాము మంచి స్నేహితులుగా ఉన్నామంటూ నరేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. వీరి కుమారుడు న‌వీన్‌ను హీరోగా నిల‌బెట్టేందుకు న‌రేష్ ప్ర‌య‌త్నాలు కూడా చేశాడు.

ఆ తర్వాత ప్ర‌ముఖ ర‌చ‌యిత దేవుల‌ప‌ల్లి కృష్ణ‌శాస్త్రి మ‌న‌వ‌రాలు అయిన రేఖా సుప్రియ‌ను నరేష్ రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి కూడా ఓ కొడుకు ఉన్నాడు. ఏవో కారణాల చేత వీరు కూడా విడిపోయారు. ఆ తర్వాత సినిమాల్లో న‌టిస్తోన్న సమయంలో ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఉన్న ర‌మ్య ర‌ఘుప‌తిని నరేష్ మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెతో బంధం కూడా ఆరేడేళ్ల‌కు మించి ఉండలేదని చెప్పాలి. ర‌మ్య‌తో కూడా న‌రేష్ కు ఓ కొడుకు ఉన్నాడు. ప్ర‌స్తుతం 43 ప‌విత్ర లోకేష్ ను 62 ఏళ్ల నరేష్ నాలుగో పెళ్లి చేసుకోనున్నాడు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -