Balayya-Rajamouli: బాలయ్య రాజమౌళి కాంబినేషన్ లో ఈ సినిమాలు మిస్ అయినట్టేనా?

Balayya-Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది అంటే అంచనాలు వేరే లెవెల్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఊహించుకోవడానికి ఆ ఊహలు అందడం లేదు. రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ లలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోవడంతో పాటు అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు. రాజమౌళి తన కెరియర్ లో ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించాయి. అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.

కాగా జక్కన్న ఈ తరం జనరేషన్ స్టార్ హీరోలు అయిన ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్,రవితేజ, నాని లాంటి హీరోలతో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్ లను అందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు రాజమౌళి సీనియర్ హీరోలతో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే బాలకృష్ణ రాజమౌళి కాంబినేషన్లో రెండుసార్లు సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల వారిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వలేదట. జూనియర్ ఎన్టీఆర్ తో 20 ఏళ్ల కిందట తెరకెక్కించిన సింహాద్రి సినిమా కథను రాజమౌళి మొదట బాలకృష్ణకు వినిపించారట.

 

ఆ సమయంలో బాలకృష్ణ పలనాటి బ్రహ్మనాయుడు సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా ఛాన్స్ ని మిస్ చేసుకున్నారట. ప‌ల‌నాటి బ్ర‌హ్మానాయుడు సినిమాకు ముందు వ‌ర‌కు బాల‌య్య, బి.గోపాల్‌ది సూప‌ర్ డూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌. అప్ప‌టికి రాజ‌మౌళి ఒక్క సినిమా మాత్ర‌మే చేశాడు. దీంతో బాల‌య్య బ్ర‌హ్మనాయుడు సినిమా చేసేందుకు మొగ్గు చూప‌డంతో సింహాద్రి క‌థ‌పై ఆస‌క్తి చూప‌లేదు. ఆ తర్వాత మగధీర సినిమా కథను కూడా ముందుగా రాజమౌళి బాలయ్యకే చెప్పారట. ఈ విషయాన్ని బాలయ్య అన్‌స్టాప‌బుల్ షోలో రాజమౌళి బయటపెట్టారు. అనివార్య కారణాలతో ఆ సినిమా కూడా చివరకు రామ్‌ చ‌రణ్ చేయాల్సి వచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటిసారిగా రు. 50 కోట్ల క్లబ్ లో చేరిన సినిమా మగధీర రికార్డులకు ఎక్కింది. అలా బాలయ్య,రాజమౌళి కాంబినేషన్లో రావల్సిన ఈ రెండు సినిమాలు మిస్ అయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -