Movies: హిట్ కావాల్సిన ఈ పది సినిమాలు అందుకే ఫ్లాపయ్యాయా?

Movies: కొన్ని సినిమాలకు హిట్ టాక్ వినిపించినప్పటికీ.. థియేటర్లలో రిలీజ్ అయ్యాక ఫ్లాప్ సొంతం చేసుకుంటాయి. అలాంటి సినిమాలు టాలీవుడ్‌లో చాలానే ఉంటుంది. కంటెంట్ విషయంలో చాలా మంది ప్రేక్షకులకు సినిమా నచ్చినప్పటికీ.. థియేటర్లలో బోల్తా కొట్టిన మూవీస్ ఎన్నో ఉన్నాయి. అయితే ఆ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో.. ఏఏ సినిమాలు ఫ్లాప్ అయ్యాయో.. వాటి గురించిన వివరాలు తెలుసుకుందాం.

 

నాగచైతన్య ఫస్ట్ మూవీ ‘జోష్’..

నాగ చైతన్య హీరోగా నటించిన ఫస్ట్ మూవీ ‘జోష్’. వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ని తెగ ఆకట్టుకుంది. ఈ సినిమా భారీ అంచనాలతోనే రిలీజ్ అయింది. సినిమాకు ముందు మంచి హిట్ అందుకుంటుందని భావించారు. కానీ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ.. థియేటర్లలో బోల్తా కొట్టింది.

 

ఆర్య సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘జగడం’. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ను చూసి దర్శకధీరుడు రాజమౌళి కూడా మెచ్చుకున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే మెప్పించింది. కానీ థియేటర్లలో బోల్తా కొట్టింది. అలాగే విజయదేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘గీతా గోవిందం’. ఇందులో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందనా నటించింది. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘డియర్ కామ్రేడ్’ సినిమా వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

 

 

డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈయన దర్శకత్వంలో వచ్చిన ప్రతీ సినిమాను ప్రేక్షకులు మిస్ కాకుండా చూస్తుంటారు. ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘సమ్మోహనం’. లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. థియేటర్‌లో నెగిటివ్ టాక్ దక్కించుకుంది. కానీ టీవీలో విడుదలైనప్పుడు ఈ సినిమాను చూసి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. తెలుగు ఆడియన్స్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. అలాగే శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన సినిమా ‘అంద‌రి బంధువయ్య’. ఈ సినిమా గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ‘ఆ న‌లుగురు’ సినిమా డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించారు. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా థియేటర్లలో బోల్తా కొట్టింది. కానీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -