Balayya: బాలయ్య భోజనం మానేయడం వెనుక అసలు కారణాలు ఇవేనా?

Balayya: నటసింహం నందమూరి బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ క్యారెక్టర్‌లో అయినా అలాగే ఒదిగిపోతారు. పౌరాణిక పాత్రలు అయినా, సోషల్ ఫాంటసీ సినిమాలు అయినా, మాస్ క్యారెక్టర్లు అయినా.. ఇలా ఏ పాత్రల్లో అయినా సరే.. పాత్రకు తగట్లు బాలయ్య తన యాక్టింగ్‌తో అభిమానులను ఆకట్టుకుంటాడు. ఏ పాత్రలోకి అయినా సరే పరకాయ ప్రవేశం చేస్తారు. పాత్రకు వంద శాతం న్యాయం చేయాలని బాలయ్య ప్రయత్నాలు చేస్తాడు. అందుకోసం ఎంతో శ్రమతో పాటు ఎన్ని బాధలైన భరిస్తాడు.

అయితే సినిమాలో ఓ పాత్ర కోసం బాలయ్య ఏకంగా 10 రోజులు భోజనం మానేశాడట. ప్రముఖ సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాస్ ఈ విషయాన్ని బయటపెట్టారు. అన్నం తినడానికి మేకప్ తీసేస్తే ఆలస్యం అవుతుందనే కారణంతో పది రోజుల పాటు అన్నం తినలేదట. కేవలం జ్యూస్‌లు మాత్రం బాలయ్య తాగాడని, ఒక పాత్ర పట్ల బాలయ్య ఉన్న కమిట్‌మెంట్, ఇష్టం అలా ఉంటుందని సంగీతం శ్రీనివాస్ తెలిపారు. నిర్మాతల హీరోగా బాలయ్య గుర్తింపు తెచ్చుకున్నాడని చెప్పారు.

పాతభైరవి సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో కనిపించాడు. అందులో ఒక పాత్ర అయినా కురూపి పాత్ర కోసం బాలయ్య పడ్డ కష్టాలను సంగీతం శ్రీనివాస్ బయటపెట్టారు. ‘కురూపి పాత్ర కోసం మేకప్ వేయడానికి అప్పట్లోనే దాదాపు 2 గంటల సమయం పట్టేది. ఒకసారి మేకప్ వేసిన తర్వాత సాయంత్రం దాకా తీయడానికి కుదరదు. ఇదే సమయంలో భోజనం చేయాలంటే మేకప్ తీయాల్సి ఉంటుంది. ఒకసారి తీస్తే మళ్లీ మొదట నుంచి వేయడానికి మరో రెండు గంటల సమయం వృథా అవుతుంది. నిర్మాతల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ.. కురూపీ పాత్రపై సన్నివేశాలు జరిగినన్నీ రోజులు అంటే దాదాపు పది రోజుల పాటు జ్యూస్‌లు మాత్రమే తాగేవారు’ అని సంగీతం శ్రీనివాస్ బయటపెట్టారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: ఓటమి భయంతో జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారా.. ఈ ప్లాన్స్ కు అడ్డుకట్ట వేసేదెవరు?

YS Jagan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వార్ వ‌న్‌సైడ్ గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూట‌మికి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -