Reddys: రెడ్ల ఆవేదన, ఆక్రందన వెనుక అసలు కారణాలు ఇవేనా?

Reddys: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన తర్వాత కూడా పోతున్న డైలాగ్ కులం చూడం, మతం చూడం. అలాంటి డైలాగులు చెప్పిన జగన్ రైతుల్లోనే కులం చూసిన చరిత్ర ఆయనది అని చెప్పవచ్చు. జగన్ ఎక్కువగా రెడ్ల కే సపోర్ట్ చేస్తారని, అందుకే రెడ్లు బాగుపడిపోయారని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజానికి జగన్ పరిపాలనలో పిడికెడు మంది రెడ్లకు పదవులు వచ్చాయి. మిగతా వారంతా చితికిపోయారు. రెడ్లు అయినా సరే తమకు అన్యాయం జరిగిందని నోరెత్తితే వాళ్ల బతుకుల మీద దెబ్బకొట్టడమే వైసీపీ నేతల పని.

పై స్థాయిలో ఉండే వ్యక్తి మనస్థత్వం అదే కావడంతో కింది స్థాయి వారు ఇలాంటి పనుల్ని విచ్చలవిడిగా చేసేశారు. ఫలితంగా ఆ వర్గం వంచనకు గురయింది. చిత్తూరు జిల్లాలో ఓ రెడ్డి సామాజికవర్గ జడ్పీటీసీ పార్టీ నాయకుడితో విబేధిస్తే ఆయనపై పాత కేసులు బయటకు తీసి అరెస్ట్ చేసి ముఖాన ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశ పెట్టి పెద్ద అంతర్జాతీయ దొంగనుపట్టుకున్నట్లుగా ముద్ర వేశారు. వైసీపీ పెద్దల కాఠిన్యం ఎంత దారుణంగా ఉంటే,కులం కూడాచూడరని అప్పుడే చాలా మందికి క్లారిటీ వచ్చింది. ఇక ఆఁ తర్వాత రెడ్డి సామాజికవర్గం పై జరిగిన దారుణాలకు లెక్కే లేదు.

 

రాయలసీమలో రాజకీయ హత్యలకు గురైన వారిలో అత్యధికులు వారే. ఆస్తులు కోల్పోయింది వారే. వైసీపీ తిడితే తిట్టించుకుని కొడితే కొట్టించుకున్న వారే బతకాలి.. ఇంకెవరూ బతకూడదన్నట్లుగా పాలన సాగింది. ఒక సామాజికవర్గాన్ని దివాలా తీయించాలన్న లక్ష్యంతో జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలంతా తీవ్ర ఇబ్బంది పడ్డారు. పూర్తి స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు కోల్పోయారు. అలాంటి వారిలో రెడ్డిసామాజికవర్గం వారు ఎక్కువగా ఉన్నారు నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఉపాధి కోసం రాష్ట్రం దాటిన రెడ్లు ఎంతో మంది. పోనీ పార్టీని నమ్ముకున్న రెడ్లను అయినా బాగు పరిచారా అంటే మన ప్లేట్లో మన బిర్యానీ అని కథలు చెప్పి.. ప్రభుత్వం రాగానే పనులు చేయించి బిల్లులు ఇవ్వమని అడిగితే వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెడ్లు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -