Vijaya Sai Reddy: విజయసాయిరెడ్డి సైలెన్స్ వెనుక అసలు కారణాలు ఇవేనా?

Vijaya Sai Reddy: రామోజీరావు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల కాలంలో రామోజీరావు పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే. రామోజీ రావు కి పాపం పండిందని మూడిందంటూ వార్తలు జోరుగా వినిపిస్తూనే. ఇది ఇలాంటి రామోజీరావు పేరు వింటే చాలు వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డి మండిపడేవారు.. ఈనాడు ప‌త్రిక‌లో త‌న‌ను టార్గెట్ చేసి వార్త‌లు రాయ‌డంపై స‌ద‌రు ప‌త్రిక‌తో పాటు య‌జ‌మాని రామోజీరావు పై ట్విట‌ర్ వేదిక‌గా ఘాటు వ్యాఖ్య‌లు చేసేవారు.

తాజాగా మార్గ‌ద‌ర్శి విష‌యంలో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఏకంగా రామోజీరావు, ఆయ‌న కోడలు శైల‌జాకిర‌ణ్‌ల‌ను ఏ1, ఏ2లుగా నిర్ధారించింది. ఇటీవ‌ల రామోజీని విచారించ‌డానికి ఏపీ సీఐడీ హైద‌రాబాద్ వెళ్లింది. విచార‌ణ సంద‌ర్భంలో రామోజీ అనారోగ్యంతో పేరుతో మంచమెక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దాంతో రామోజీ పై తీవ్ర స్థాయిలో విమర్శలను గుర్తించారు. అంతేకాకుండా ఒక రేంజ్ లో సెటైర్స్ కూడా వేశారు. ఇంత‌కాలం మీడియాను అడ్డు పెట్టుకుని అంద‌రిపై ఇష్టానుసారం వార్త‌లు రాసిన రామోజీకి పాపం పండే రోజు వ‌చ్చింద‌ంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే రెండు మూడు రోజులుగా రామోజీకి ఇంత జరుగుతున్నా కూడా ఆయన శత్రువు అయిన విజయసాయి రెడ్డి మాత్రం ఉలుపు పలుకు లేకుండా మౌనంగా ఉండడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విజ‌య‌సాయిరెడ్డిలో ఇంత స‌హ‌నం ఏంట‌బ్బ ఇవన్నీ విజయసాయిరెడ్డి లో ఎప్పుడు వచ్చాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే మార్గ‌ద‌ర్శిలో సోదాలు నిర్వ‌హించ‌డంపై స్టే వ‌చ్చిన సంద‌ర్భంలో, సంబంధిత ఈనాడు క‌థ‌నాన్ని గ‌త ఏడాది డిసెంబ‌ర్ 18న విజ‌య‌సాయిరెడ్డి ట్విట‌ర్‌లో షేర్ చేశారు. అలాగే దానిపై త‌న మార్క్ ఘాటు కామెంట్స్ చేశారు. ఆ ట్వీట్ లో రామోజీ.. సమాచారం అడిగితే స్టే. సోదాలు నిర్వహిస్తే కోర్టుకెళ్తావు. మళ్లీ పారదర్శకత, ప్రజాస్వామ్యం అంటూ నీతులు చెప్తావు. ఏ తప్పూ చేయకపోతే ధైర్యంగా విచారణను ఎదుర్కో. అప్పుడు తేలుతాయి నీ బాగోతాలు. కాగా గ‌త ఏడాది డిసెంబ‌ర్ 18వ తేదీనే రామోజీ పై మ‌రో ట్వీట్ చేశారు విజ‌య‌సాయిరెడ్డి.

కానీ ప్రస్తుతం ఏపీలో ఇంత జరుగుతున్న కూడా రామోజీ విషయంపై విజయసాయిరెడ్డి స్పందించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా రామోజీపై అక్క‌సు వెళ్ల‌గ‌క్కిన విజ‌య‌సాయిరెడ్డి… ఇప్పుడు పూర్తిగా మౌనాన్ని ఆశ్ర‌యించ‌డం విశేష‌మే. గ‌త ఏడాది డిసెంబ‌ర్ వ‌ర‌కూ రామోజీరావును బ‌ద్ధ శ‌త్రువుగా భావించిన విజ‌య‌సాయిరెడ్డి, ఆ త‌ర్వాత ఏ ఒక్క‌రిపై కూడా విమ‌ర్శ‌లు చేయ‌ని సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 19న విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చూస్తే రామోజీపై ఆయ‌న ఆగ్ర‌హాన్ని అర్థం చేసుకోవ‌చ్చు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -