Samantha: ప్రాణాలు పోయేంత ఆరోగ్య సమస్య సమంతకు అందుకే వచ్చిందా?

Samantha: ఇటీవల సమంతకు సంబంధించిన ప్రతి వార్త సెన్సెషనల్ అవుతోంది. సమంత అప్పుల్లో కూరుకుపోయిందనే వార్త నుంచి ఫ్యాన్స్ బయట పడకముందే.. మరో విషాద వార్త ఎదురైంది. సోషల్ మీడియాలో ఆమె తన ఆరోగ్య పరిస్థితిని వివరించగానే సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అందరూ హీరోలు ఆమెకు మద్దతుగా నిలబడుతున్నారు. ఆమెకు మయోసైటిస్ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో సమంత అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. అయితే సమంత కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. మరికొద్ది రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని చెప్పారు.

అనారోగ్యానికి గురైన సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు, స్టార్ హీరోలు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనుషులకు చాలా సునాయాసంగా వ్యాధులు సంక్రమిస్తున్నాయి. కొన్ని సార్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ సమంత తన హెల్త్ విషయంలో ఎంతో కేరింగ్‌గా ఉంటుంది. అలాంటి సమంతే డేంజరస్ వ్యాధితో బాధపడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వ్యాధిపై ఇప్పటికే ఎన్నో ప్రచారాలు ప్రారంభమయ్యాయి. సమంతకు కండరాలకు సంబంధించిన వ్యాధి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. మయోసైటిక్ వ్యాధి వల్ల కండరాలు బలహీన పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరం నీరసంగా మారడం, చర్మానికి త్వరగా ఇన్ఫెక్షన్ సోకడం వంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం విషయంలో సమంత ఇంకా కేర్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే ఈ వ్యాధి సోకడానికి ఖచ్చితమైన కారణాలను వైద్యులు చెప్పలేకపోతున్నారు. కానీ అతిగా మద్యం సేవించడం, డ్రగ్స్ వాడకం వల్ల ఆటో ఇమ్యూన్ లక్షణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత తీవ్ర ఒత్తిడిలో వీటికి బానిసైనట్లు తెలుస్తోంది. అలాగే సినిమాల కోసం జిమ్‌లో ఎక్కువగా వర్కౌట్లు చేయడం ప్రభావం చూపి ఉంటుందని భావిస్తున్నారు. కాగా, సమంత ప్రస్తుతం యశోద చిత్రంలో నటించింది. అలాగే బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌తో కలిసి వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సీరిస్‌లో యాక్షన్స్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో వాటి కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -