Tollywood: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు దిగజారుడు సినిమాలు తీస్తున్నారా?

Tollywood: తెలుగు సినిమా అంటే ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. బాహుబలి, బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, మేజర్, కార్తికేయ2 లాంటి సినిమాలు తెలుగు సినిమా స్టామినాను చాటాయి. కొన్ని సినిమాలు కమర్షియల్ గా భారీ హిట్ అయితే కొన్ని మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పును పొందాయి. మరికొన్ని మాత్రం ట్రెండ్ సెట్టింగ్ సినిమాలుగా నిలిచాయి.

 

తెలుగు సినిమా స్థాయి పూర్తిగా మారిపోయిన ఈ తరుణంలో టాలీవుడ్ బడా హీరోలుగా ఉన్న చిరంజీవి మరియు బాలయ్యల సినిమాలు అందరి ముందు కొత్త ప్రశ్నలను ఉంచుతున్నాయి. మెగాస్టార్ గా ఉన్న చిరంజీవి మరియు నటసింహం బాలయ్యను దర్శకుడు ఏమేరకు వాడుకుంటున్నారనేది చూడాల్సి వస్తుంది. కేవలం ఫ్యాన్స్ ను అలరించాలని, కమర్షియల్ గా హిట్ కావాలనే ఉద్దేశంతో మాత్రమే సినిమాలు తీస్తే ఎలా ఉంటుందనే విషయం తాజాగా చిరు, బాలయ్య సినిమాలు చూస్తే అర్థమవుతుంది.

 

నిజానికి సగటు ప్రేక్షకుడు కథలో కొత్తదనాన్ని, నటనలో పరిణతిని చూడాలనుకుంటాడు. సినిమాను చూస్తున్నంత సేపు కొత్త అనుభూతి కలగాలని అనుకుంటాడు. కానీ చిరు, బాలయ్యల కొత్త సినిమాలు చూస్తే మాత్రం గతంలో వాళ్లు చేసిన పాత సినిమాలు అనేకం కళ్లముందు కదులుతుంటాయి. అంటే దర్శకులు తమలోని నిజమైన దర్శకత్వ పాఠవాన్ని చూపించలేకపోతున్నారనే విషయం అర్థమవుతుంది.

 

తెలుగు సినిమా పేరుకు ఇప్పుడు ఉన్నంత పేరు లేనప్పుడే కమర్షియల్ హిట్లు ఇచ్చి, తెలుగు సినిమాలకు ఇతర రాష్ట్రాల్లో కూడా డిమాండ్ వచ్చేలా చేసిన హీరోలు చిరంజీవి మరియు బాలయ్యలు. అయితే వీరు ఇంకా పాత పద్ధతిలోనే పాత కథలనే తిప్పి తిప్పి చేస్తుంటే వాళ్ల అభిమానులు విజిల్స్ వేసి ఎంజాయ్ చేస్తారేమో కానీ సగటు ప్రేక్షకుడు మాత్రం పెద్దగా ఖుషీ అవ్వడు. ఈ విషయం దర్శకులకు అర్థమై కొత్తగా వాళ్లను చూపించడంతో పాటు వారి నటనా అనుభవాన్ని సరైన స్థాయిలో వాడుకుంటే తెలుగు సినిమా మరో లెవల్ కు వెళుతుందనే నెటిజన్ల కామెంట్లను ఖచ్చితంగా ఆలోచించాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -