Varun Tej-Lavanya Tripathi: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి అప్పుడే పెళ్లి చేసుకోనున్నారా?

Varun Tej-Lavanya Tripathi: మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల పేర్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారని త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు అంటూ అనేక రకాల వార్తలు వినిపించగా తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ ఈ జంట ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటయ్యారు.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వీరిద్దరి విషయం హాట్ టాపిక్ గా మారింది. గత రాత్రి వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుకకు మెగా ఫ్యామిలీ అలాగే లావణ్య త్రిపాఠి ఫ్యామిలీలు హాజరైన విషయం తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుకలు నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగాయి. ఇది ఇలా ఉంటే ఎంగేజ్మెంట్ వేడుక ముగిసిందో లేదో అప్పుడే అభిమానులు పెళ్లెప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో లావణ్య, వరుణ్ తేజ్ ల పెళ్లికి సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే అక్టోబర్ 17వ తేదీ ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ పెళ్లి డేట్ ను ఫిష్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉంటే వరుణ్ తేజ్ ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తదుపరి సినిమాలలో భాగంగా బిజీ బిజీగా వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కావడంతో కొద్ది రోజులు షూటింగ్ గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. లావణ్య విషయానికి వస్తే గత కొంతకాలంగా ఈమెకు వస్తున్న సినిమా ఆఫర్లన్నీ రిజెక్ట్ చేస్తూ వస్తోంది

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -