Life: మీ భార్యతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా.. అయితే మీ జీవితం నాశనమే!

Life: ప్రస్తుత రోజుల్లో చాలామంది భర్తలకు ఒక సమస్య ప్రధాన సమస్యగా మారిపోయింది. అదేమిటంటే నా భార్య నా మాట వినడం లేదు. బయట ఎంతో మంది నన్ను చూస్తే భయపడతారు కానీ నా భార్య మాత్రం నాకు గౌరవం ఇవ్వడం లేదు నా మాట వినడం లేదు అని చాలా మంది పురుషులు రేషన్ ఎక్స్పర్ట్స్ దగ్గర వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. త‌మ భార్య త‌న మాట వినేలా చేసుకోలేక‌పోతున్నామ‌నే నూన్య‌తాభావం ఈ తరం పురుషులను వెంటాడుతూనే ఉంది. మ‌రి స‌మ‌స్య ఎక్క‌డ ఉంది అంటే ఈ వ్య‌వ‌హారాన్ని విశ్లేషిస్తే అబ్బాయిలు తాము ఎలాంటి కాలంలో ఉన్నామో గుర్తించ‌క‌పోవ‌డంతోనే ఈ స‌మ‌స్య ఉత్ప‌న్నం అవుతోంద‌నేది ప్రాథ‌మికంగా చెబుతున్నారు.

చాలామంది భర్తలు ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే.. త‌న భార్య త‌న కుటుంబంతో స‌రిగా క‌ల‌వ‌ద‌ని, త‌న అక్కచెల్లెల్లు, అన్న వ‌దిన‌ల‌తో మెల‌గ‌ద‌ని, త‌న త‌ల్లిదండ్రుల‌ను కూడా పెద్ద‌గా ఖాత‌రు చేయ‌ద‌ని, అన్నింటికీ మించి సొంతూళ్లో త‌న ఊర్లో గ‌డ‌ప‌డానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌దు అనేది భర్తల సాధార‌ణ కంప్లైంట్.

అయితే ఎప్పుడైతే త‌న భార్య‌ను పూర్తిగా చెప్పుచేత‌ల్లో పెట్టుకోవాల‌నే ఆలోచ‌న మొద‌లైందో అక్క‌డ నుంచినే ప్ర‌శాంత‌త అనేది న‌యాత‌రం భ‌ర్త‌కు క‌నుమ‌రుగు అవుతుంది. ఇది కాద‌న‌లేని వాస్త‌వం. త‌ను కోరుకున్న‌ట్టుగానే త‌న భార్య ఉండాల‌నుకోవ‌డం ప్ర‌తి మ‌గాడి ఆశ‌. మ‌రి ఈ ఆశ నెర‌వేర‌డం తేలికేమీ కాదు. అందం, ఆస్తులు, ఉద్యోగం, క‌ట్నం ఇలాంటి విష‌యాల్లో అంచ‌నాలు నిజ‌మైనా ఇవ‌న్నీ నిజ‌మ‌య్యాక అమ్మాయి వ్య‌వ‌హ‌ర‌న తీరు కూడా తాము కోరుకున్న‌ట్టుగానే ఉండాల‌నుకోవ‌డం అబ్బాయిల దురాశ‌.

 

అయితే ఎప్పుడైతే ముంద‌స్తుగా చూసుకునే వాటి విష‌యంలో అబ్బాయిల అంచ‌నాలు నిజం అవుతున్నాయో, పెళ్లి త‌ర్వాత అమ్మాయి చెప్పుచేత‌ల్లో ఉండ‌టం మాత్రం దుర్ల‌భం కావ‌డం రొటీన్ గా మారింది. ఇందులో అబ్బాయిల సమస్యనే సమస్యలకు ప్రధాన మూలం. అమ్మాయిల‌ను అబ్బాయిలు ఊరికే పెళ్లిళ్లు చేసుకోవ‌డం లేదు. ఆమెకు అందం ఉండాలి, ఆస్తిపాస్తులుండాలి, చ‌దువుకుని ఉండాలి, ఉద్యోగం చేయ‌డం చేయ‌క‌పోవ‌డం అబ్బాయి కుటుంబం ఇష్టానుసారం అయి ఉండాలి! ఇవ‌న్నీ కుదిరితేనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. తీరా పెళ్లి త‌ర్వాత అబ్బాయి త‌న కుటుంబ ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా అమ్మాయి న‌డుచుకోవాలంటున్నాడు. మ‌రి పెళ్లికి ముందే ఈ ప‌రిస్థితులు ఏవో ఆమెకు, ఆమె కుటుంబానికి అర్థ‌మ‌య్యేలా చేస్తే స‌రిపోతుంది. కాబట్టి భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉండాలి అంటే ఒకరి మాటను మరొకరు గౌరవించాలి. అదేవిధంగా భార్య మాటను వింటేనే భర్తల జీవితాల్లో కూడా సంతోషం ఉంటుందని చెప్పవచ్చు. అలా అని భర్తలు భార్యల చెప్పుచేతుల్లో ఉండమని అర్థం కాదు.. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అన్నది తప్పనిసరి.

 

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -