Corona: మూడేళ్లుగా ప్రపంచాన్ని గత ఏడాదిగా తగ్గుముఖం పడటంతో ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు కోలుకుంటున్నాయి. కరోనా మొదటి, రెండవ వేలో పాజిటివ్ వచ్చి కోలుకున్న వారు నానా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కరోనా సోకి తగ్గిన తర్వాత కూడా సాధారణ చికిత్స కన్న ఎక్కువగా చేసుకుంటే మరిన్ని రోగాల బారిన పడుతున్నారని ఓ అధ్యాయనంలో తేలింది. అయితే తరచూ వ్యాయామాలు చేసే వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా సోకి తగ్గిన తర్వాత మోతాదుకు మించి వ్యాయామాలు అంతగా మంచివి కావని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా దీర్ఘకాలికంగా కరోనా వైరస్‌తో బాధపడిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కోలుకున్నాక కూడా కరోనా వైరస్ ప్రభావం చాలా కాలం ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడకముందు చేసిన కఠినమైన వ్యాయామాలను ఇప్పుడు వెంటనే చేయొద్దని సూచిస్తున్నారు. గతంలో మొట్టమొదటిసారి వ్యాయామం చేసినట్లే ఇప్పుడు కూడా తేలికపాటి వ్యాయామాలతో మొదలు పెట్టి క్రమంగా కఠినమైన వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. అదే సమయంలో వ్యాయామం చేయడం వల్ల కలిగే అలసటను గమనిస్తూ అవసరాన్ని బట్టి వ్యాయామానికి విరామం ఇవ్వాలని దీర్ఘకాలిక కరోనాతో బాధపడిన వాళ్లు మాత్రం వ్యాయామానికి దూరంగా ఉండటమే చాలా మంచిదని సూచిస్తున్నారు.
కరోనా నుంచి కోలుకున్నాక తరచూ ఆయాసం, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలకు వ్యాయామంతో చెక్ పెట్టొచ్చని పలు అధ్యయనాల్లో వెల్లడైందని దీంతో వ్యాయామం చేయడాన్ని ఇష్టపడే వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వైరస్ బారిన పడి కోలుకున్నాక వ్యాయామం చేసే విషయంలో జాగ్రత్తలు అవసరమని పేర్కొన్నారు. ఒక వేళ అంతగా వ్యాయామం చేయాలనిపిస్తే మొదటి కన్నా చాలా వరకు తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.