Health Tips: ఉప్పు తక్కువగా తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Health Tips: ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అయితే మనం ఎటువంటి ఆహారం తీసుకున్న కూడా మితంగా తీసుకోవాలని చెబుతూ ఉంటారు. ఎటువంటి ఆహారం తీసుకున్న కూడా ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మితిమీరి ఏది తీసుకోకూడదు. ఇకపోతే ఉప్పు విషయానికి వస్తే కొందరు అధికంగా ఉప్పునీ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఉప్పును అధికంగా తినడం వల్ల బీబీ వస్తుంది అన్న విషయం తెలిసిందే. దాంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అలా అని ఉప్పు తక్కువగా తిన్న కూడా సమస్యలు వస్తాయండోయ్.

అదేంటి అనుకుంటున్నారా. మీరు విన్నది నిజమే. ఉప్పును తక్కువగా తిన్నా కూడా అనేక సమస్యలు వస్తున్నాయి అంటున్నారు నిపుణులు. మరి ఉప్పును తక్కువగా తింటే ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి సరిగా అవ్వనప్పుడు హైపో థైరాయిడిజం అనే సమస్య వస్తుంది. దాంతో శరీరంలో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. థైరాయిడ్ హార్మోన్ లోపం కనుక వస్తే ఆ వ్యక్తి నిద్రలేమి వ్యాధితో పాటు గుండె కొట్టుకోవడం తగ్గడం,ఉన్నట్టుండి బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కోసం మంచి ఆహారం తీసుకోవాలి. వ్యాయామనం చేయాలి.

 

బీపీ వస్తుందని ఉప్పును తగినంత తీసుకోకపోవడం ఆరోగ్యంపై తీవ్ర ప్రమాదం చూపిస్తుంది. ఉప్పులోని అయోడిన్ మన శరీరానికి ఎంతో కీలకం. శరీరంలో థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయడానికి ఉప్పు చాలా బాగా పనిచేస్తుంది. మన శరీరలో అయోడిన్ శాతం లోపిస్తే హైపోథైరాయిడిజం ప్రమాదం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విటమిన్లు డి, బి12, మెగ్నీషియం, ఐరన్ తగినంతగా తీసుకోవాలి. అప్పుడే ఎముకలు బలంగా తయారవుతాయి. రోగనిరోధక శక్తిన పెరిగేందుకు మంచి ఆహారం తీసుకోవాలి.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -