Hyderabad: ఇలా కూడా గుండెపోట్లు వస్తున్నాయా.. తస్మాత్ జాగ్రత్త!

Hyderabad: ఓ మూడేళ్లపాటు ప్రపంచాన్ని కరోనా వణికించింది. ఏ స్థాయిలో అంటే ప్రత్యేకంగా ఎవరికీ విడమరిచి చెప్పనవసం లేదు. ఇప్పుడే కాస్తంత కోలుకుంటున్నారు. కానీ ఒకటిపోతే మరొకటి అన్నట్లు దరిద్రం వెంటడుతూనే ఉంది. ఇప్పుడు ప్రజల్ని పీక్కతీనేందుకు మరో భూతం వచ్చింది. అదే గుండెపోటు. సాధారణంగా వయసు మళ్లిన వాళ్లలో వచ్చే ఈ సమస్య, ఇప్పుడు చిన్న పిల్లోడికి కూడా వస్తుంది.

వ్యాయామం చేసినా,వాకింగ్ చేసినా,ఎంతో అప్రమత్తంగా ఉన్నా కూడా గుండెపోటు నుంచి తప్పించుకోలేకపోతున్నారు.తాజాగా రోడ్డు మీద నడుస్తున్న వ్యక్తికి గుండెపోటుతో చనిపోయిన ఘటన హైదరాబాద్‎లో జరిగింది.నరహరి అనే వ్యక్తి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో నడుచుకుంటూ వెళ్తున్నాడు.ఈ క్రమంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా నరహరి రోడ్డు మీద పడిపోయాడు.గమనించిన బాటసారులు నరహరిని కాపాడటానికి ప్రయత్నించారు.కానీ అప్పటికే నరహరి మృతిచెందినట్లు గుర్తించారు.వెంటనే పంజాగుట్ట పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

 

మహబూబ్ నగర్ జిల్లాలో మరో యువకుడు గుండెపోటుతో మరణించాడు.రామయ్య బౌలి ప్రాంతానికి చెందిన జునైద్ అనే యువకుడు రోజు మాదిరిగానే శుక్రవారం కూడా జిమ్ కు వెళ్లాడు.అక్కడ వర్కౌట్లు చేసిన తర్వాత ఇంటికి చేరుకున్నాడు. కాసేపటికే ఛాతి నొప్పితో కుప్పకూలి మృతిచెందాడు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -