Puri Jagannadh: దర్శకుడు పూరీ జగన్నాథ్ కు అంత ధీనమైన స్థితిలో ఉన్నారా?

Puri Jagannadh: సిని ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎప్పుడు ఒకేలా ఉంటారు అనుకోవటం పొరపాటు. ముఖ్యంగా ఆర్థికంగా వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరు ఊహించలేరు. చాలావరకు వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటారు. కానీ వాళ్లకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పటికి చాలామంది సినీ ప్రముఖులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితినే మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు ఎదురయింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే డైరెక్టర్ పేరు పూరీ జగన్నాథ్. మంచి మంచి సినిమాలను రూపొందించి చిన్న హీరోలను సైతం స్టార్ హీరోలుగా మార్చాడు పూరీ జగన్నాథ్. అయితే గత కొంత కాలం నుంచి డైరెక్టర్ గా ఆయనకు అంతగా కలిసి రాకపోవటంతో.. నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. ఇక్కడ కూడా ఆయనకు అంతగా కలిసి రాలేదు.

 

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత.. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఎంతలా డిజాస్టర్ టాక్ అందుకుందో చూసాం. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రూపొందించగా.. ఈ సినిమా అసలు సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమాను డైరెక్టర్ గా, నిర్మాతగా రూపొందించింది ఆయననే.

 

దీంతో ఆర్థికంగా ఆయన బాగా దెబ్బతిన్నాడు. అలా గత కొన్ని రోజుల నుంచి ఆయన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. గతంలో ఈయన తన భార్య లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా లావణ్యని తీసుకొని వచ్చాడు పూరీ. ఆ సమయంలో ఆయన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఆయన పెళ్లి కోసం యాంకర్ ఝాన్సీ తాళిబొట్టు కొనిచ్చిందని, నటి హేమ.. లావణ్య కు పెళ్లి బట్టలు పెట్టిందని తెలిసింది. అలా పెళ్లి సమయంలో తాళిబొట్టు కొనలేని పరిస్థితుల్లో కష్టాలు పడ్డ పూరి జగన్నాథ్.. ఇప్పుడు మళ్లీ అటువంటి కష్టాల్లో చిక్కుకుపోవటంతో ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -