Sneha: ఆ రీజన్స్ వల్లే స్నేహ భర్తకు దూరంగా ఉంటున్నారా?

Sneha: తెలుగు హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే చేసే వాళ్లు కాదు అని చాలామంది హీరోయిన్లు నిరూపించారు. సినిమాల్లో హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ డాల్ లాగా ఉంటుందనే వ్యాఖ్యలను వీరు తప్పని నిరూపించారు. ఇలాంటి కోవలోకే వస్తుంది హీరోయిన్ స్నేహ. తమిళ సినిమాల నుండి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్.. తెలుగులో ఎన్నో సినిమాలు చేసినా ఎప్పుడూ గ్లామర్ మీద ఆధారపడలేదు. కుందనపు బొమ్మలా ఉండే ఈ హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం తెలిసిందే.

 

 

తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు ప్రసన్నని హీరోయిన్ స్నేహ ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోగా.. ఐదు సంవత్సరాలు వేచి ఉండి, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. వీరు సినిమాలతో పాటు యాడ్స్ లో కూడా కలిసి కనిపించడం తెలిసిందే. అయితే తాాజాగా వీరికి సంబంధించిన ఓ వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

 

 

హీరోయిన్ స్నేహ.. తన భర్త ప్రసన్నతో దూరంగా ఉంటుందనే వార్త ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రసన్నతో విభేదాలు వచ్చాయని, అందుకే ఆమె తన భర్త నుండి విడిపోయి దూరంగా వేరే ఇంట్లో ఉంటుందనే వార్త ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తోంది. హీరోయిన్ స్నేహ తన ఇద్దరు పిల్లలతో కలిసి విడిగా ఉంటోందని తెలుస్తుండగా.. ఈ వార్త ఎక్కడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తపడ్డారు.

 

తాజాగా సినీ జనాలకు ఈ వార్త తెలియగానే.. అందరూ ఏదైనా ఉంటే కలిసి కూర్చొని సెటిల్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. అసలు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. మీ కోసం కాకపోయినా మీ పిల్లల కోసమైనా మీరిద్దరు సర్దుకుపోవాలని, తిరిగి కలిసి ఉండాలని కొందరు నెటిజన్లు కోరుకుంటున్నారు. మరి వీరు విడిపోతారా? లేదంటే పిల్లల కోసం కలిసిపోతారా? అనేది చూడాలి.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -