Constipation: మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ఇలా చేయాల్సిందే?

Constipation: ప్రస్తుత రోజుల్లో ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ మలబద్ధకం సమస్య ఆ నొప్పిని భరించే వారికి మాత్రమే తెలుస్తుంది.. కొన్ని కొన్ని సార్లు ఆ సమస్య తీవ్రమైతే ఆపరేషన్లు కూడా చేయాల్సి వస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటె ఇతర అనారోగ్య సమస్యల్ని కూడా ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే మలబద్ధకంతో బాధపడుతున్న వారు కిచెన్‌లో లభించే కొన్ని వస్తువులతోనే మలబద్ధకం సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

మాములుగా రోజూ తగిన మోతాదులో నీళ్లు తాగకపోవడం, ఫైబర్ ఆహారం తక్కువగా తినడం, అలాగే జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కూడా మలబద్ధకం సమస్యలు రావచ్చు. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఉసరి జ్యూస్… ఉసిరికాయ మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగించడంతోపాటు ఇతర సమస్యను కూడా దూరం చేస్తుంది. ఓట్ బార్న్.. ఓట్ బార్న్‌లో సాల్యుబుల్ , ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ రెండూ పుష్కలంగా లభిస్తాయి. ఈ రెండింటి కారణంగా మలబద్ధకం సమస్య దూరమౌతుంది. అలాగే నెయ్యి, పాలు.. నెయ్యిలో బ్యాక్టీరిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తుంది.

 

ఇది ఇంటెస్టైన్ మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. మల విసర్జన సులభమయ్యేందుకు తోడ్పడుతుంది. మలబద్ధకం దూరం చేసేందుకు ఒక కప్పు వేడి పాలలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకుని తాగాలి. ఆకు కూరలు.. ఆకు కూరల్లో ఉండే ఫైబర్ కారణంగా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. దీనికోసం బ్రోకలీ, పాలకూర, బ్రసెల్స్ స్ప్రౌట్స్ వంటి పదార్ధాలు తీసుకోవాలి. వీటిలో ఫైబర్‌తో పాటు విటమిన్ సి, ఫోలేట్ కూడా ఉంటాయి. అలాగే నీళ్లు..ప్రతిరోజూ తగిన మోతాదులో అంటే రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగితే మలబద్ధకం సమస్యను దూరం చేయవచ్చు. రోజుకు కావల్సిన నీరు తాగకపోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీ మొత్తం జనసేన వెంటే.. పవన్ ఆ ఒక్క మాటతోనే పడేశారుగా!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పొత్తు కుదరకుండా వైసీపీ ఎన్నిక కుట్రలు చేసినా.. ఓపిక్కా.. సహనంగా.. పొత్తు కుదిరేలా జనసేన అధినేత పవన్ తీవ్రంగా శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు....
- Advertisement -
- Advertisement -