ATM Charges: ఆ బ్యాంకుల ఏటీఎంలలో డబ్బులు తీస్తున్నారా.. ఇవి పాటించండి!

ATM Charges: ప్రస్తుత కాలంలో డబ్బులు జమ చేయాలన్నా.. డ్రా చేయాలన్నా ఎవరూ బ్యాంకులకు వెళ్లడం లేదు. ఇప్పుడంతా డిజిటలైజేషన్‌ కావడంతో ఏటీఎం మిషన్ల ద్వారానే కానిచ్చేస్తున్నారు. ప్రారంభంలో కేవలం ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసేందుకే వీలుండేది.. ఇప్పుడు డిపాజిట్‌ సైతం చేసే సదుపాయం ఉండటంతో అందరు ఏటీఎంలనే వాడుతున్నారు. అయితే ఏటీఎం లావాదేవీలు నిర్వహించిన కస్టమర్లపై కొన్ని సర్వీసు చార్జీలను మరోసారి పెంచేశాయి.
అయినా కొంత మంది బ్యాంకు ఖాతాదారులు ఇప్పటికీ ఏటీఎం ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఏటీఎం సేవలు ఉపయోగించుకుంటున్నందుకు ప్రతి ఖాతాదారులు తమ బ్యాంకుకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం సేవలు అందిస్తున్న బ్యాంకులు కూడా ఆయా సేవలపై చార్జీలు పెంచేశాయి. దాదాపు అన్ని బ్యాంకుల సొంత ఏటీఎంల్లో ఐదు ట్రాన్సాక్షన్స్‌ ఫ్రీ నిర్దిష్ట సంఖ్య దాటిన లావాదేవీలపై బ్యాంకులకు సర్వీస్‌ చార్జీలు పే చేయాల్సి ఉంటుంది. ఆయా ఖాతాలను బట్టి ఏటీఎం చార్జీలు నిర్దేశిస్తారు.

ఐసీఐసీఐ: ఐసీఐసీఐ బ్యాంకు సైతం దేశంలోని ఆరు మెట్రోపాలిటన్‌ సిటీల పరిధిలో సొంత ఏటీఎంల్లో ఐదు, ఇతర బ్యాంకు ఏటీఎంల్లో మూడు లావాదేవీలు ఉచితంగా అందిస్తుంది. పరిమితి దాటి జరిపే ప్రతి ఆర్థిక లావాదేవీపై రూ.20, నాన్‌ ఫైనాన్సియల్‌ ట్రాన్సాక్షన్‌ మీద రూ.8.50 వసూలు చేస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏటీఎంలు, నాన్‌–ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏటీఎంలలో సేవలకు ఈ నియమాలు వర్తిస్తాయి.

హెచ్‌డీఎఫ్‌సీ: హుచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రతి నెలా తన సొంత ఏటీఎంలో ఐదు లావాదేవీలు ఫ్రీగా అందిస్తుంది. మెట్రో సిటీలలో ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు, నాన్‌ మెట్రో సిటీల్లోని ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో ఐదు లావాదేవీలు ఉచితంగా పొందొచ్చు. ఈ పరిధి దాటిన ప్రతి ట్రాన్సాక్షౖ న్స్‌పై రూ. 21 తోపాటు అనుబంధ చార్జీలు, నాన్‌ ఫైనాన్సియల్‌ ట్రాన్సాక్షన్‌ మీద రూ.8.50 తీసుకుంటుంది.

ఎస్బీఐ ఏటీఎం: భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ) ప్రతి రీజియన్‌ పరిధిలో ఒక నెలలో ఐదు ఉచిత విత్‌డ్రాల సౌకర్యం కల్పిస్తుంది. ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల పరిధిలో ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో ప్రతి నెలా మూడు ట్రాన్సాక్షన్స్‌ ఫ్రీగా చేసుకోవచ్చు. ఒక నెలలో సొంత ఏటీఎంల్లో ఐదు కంటే ఎక్కువ లావాదేవీలు జరిగినా, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్‌ జరిపినా ఫీజు వసూలు చేస్తుంది. సొంత ఏటీఎంల్లో ఐదు లావాదేవీలు దాటాక ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ. 10. ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో పరిమితి తర్వాత జరిపే ప్రతి విత్‌ డ్రాలైనా రూ. 20 వసూలు చేస్తుంది.

పీఎన్‌బీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) కూడా మెట్రో పాలిటన్‌ సిటీల పరిధిలో సొంత ఏటీఎంల్లో ఐదు, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు లావాదేవీల వరకు ఫ్రీ అంతకు మించి జరిపే ప్రతి లావాదేవీపై రూ.10, ఇతర బ్యాంకుల్లో పరిధి దాటిన ఆర్థిక లావాదేవీలపై రూ. 20, నాన్‌ –ఫైనాన్సియల్‌ ట్రాన్సాక్షన్‌ మీద రూ. 9 వసూలు చేస్తోంది.

యాక్సిస్‌: యాక్సిస్‌ బ్యాంక్‌ సొంత ఏటీఎంలలో మెట్రో సిటీల పరిధిలో ఐదు ఉచితంగా, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు లావాదేవీలు ఫ్రీగా చేసుకోవచ్చు. ఈ పరిమితి దాటిన ప్రతి నగదు విత్‌ డ్రా పై రూ.21, నాన్‌ ఫైనాన్సియల్‌ ట్రాన్సాక్షన్‌పై రూ. 10 వసూలు చేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -