Arthi Agarwal: ఆ నిర్మాత ఆర్తి అగర్వాల్‌ను ఫుల్లుగా వాడేశాడా?

Arthi Agarwal: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్లలో నటి ఆర్తి అగర్వాల్ ఒకరు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ భామ.. స్టార్ హీరోల సరసన నిలిచి పలు హిట్ సినిమాల్లో నటించింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ఆర్తి యాక్టింగ్‌కు కూడా మంచి మార్కులు పడ్డాయి. నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించింది. ‘వసంతం, సంక్రాంతి, ఇంద్ర, నేనున్నాను, అడవి రాముడు, నరసింహుడు’ ఇలా పలు హిట్ సినిమాల్లో నటించింది. టాలీవుడ్‌లోనే దాదాపు 50కిపైగా సినిమాలు చేసింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకాభిమాన్ని సంపాదించుకుంది.

 

అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ.. తన జీవితాన్ని, కెరీర్‌ను తానే నాశనం చేసుకున్నట్లు చాలా వార్తలు వచ్చాయి. హీరో తరుణ్‌తో లవ్ ట్రాక్ నడిపినట్లు ప్రచారం జరిగింది. అందుకే ఆర్తి అగర్వాల్‌కు ఆఫర్లు తగ్గాయని సమాచారం. అయినప్పటికీ హీరోయిన్‌గా రాణించాలని ఎంతో ట్రై చేసిందట. కానీ ఓ నిర్మాత వలలో చిక్కి కెరీర్ పూర్తిగా నాశనం చేసుకుందని సినీ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఆర్తికి కెరీర్ ప్రారంభంలో ఆ నిర్మాత వల్లే ఆఫర్లు వచ్చాయి. మధ్యలో స్టార్ హీరోయిన్‌గా ఎదగడంతో ఆర్తి వెనక్కి తిరిగి చూసుకోలేదు. కానీ కెరీర్ పూర్తిగా డ్రాప్ అవ్వడంతో ఆర్తి ఆ నిర్మాత దగ్గరికి వెళ్లిందట. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పడంతో గుడ్డిగా నమ్మింది ఆర్తి. సినిమాల్లో పూర్తి అవకాశాలు రాకపోవడంతో.. ఆ నిర్మాత ఆర్తి అగర్వాల్‌ను పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఆయన గెస్ట్ హౌస్‌లోనే రెండున్నరేళ్లు ఉంచుకున్నాడు. అప్పట్లో ఆర్తి అగర్వాల్ కూడా ఆ నిర్మాతతో ఎఫైర్ నడిపినట్లు టాక్ వినిపించింది. దాంతో ఆ నిర్మాత దగ్గరి నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. ఆర్తి లావుగా మారడంతో.. లైఫో సెక్షన్ చేయించుకుంది. ఊహించని విధంగా ఆమె చివరకు మృతి చెందింది. ఈ విషయంలో అప్పట్లో ఎంతో సెన్సెషనల్ అయింది.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -