Artist Siva Reddy: సినీ లవర్స్ కి మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇతడు నటుడుగా, కళాకారుడిగా తెలుగు ఇండస్ట్రీలో 100 సినిమాలకు పైగా నటించాడు. మొదటగా శివా రెడ్డి పిట్టలదొర సినిమా తో ఇండస్ట్రీలో అవకాశం దక్కించుకున్నాడు. అనంతరం బ్యాచిలర్, మనసంతా నువ్వే, ఆనందం, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు వంటి పలు చిత్రాల్లో శివారెడ్డి నటించాడు.
ఇక శివారెడ్డి నటనలో తనకంటూ ఓ గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు. ఇతడు ఎటువంటి వాయిస్ నైన ఈజీగా మిమిక్రీ చేయగలడు. ఈ మిమిక్రీ నే శివకు అద్భుతమైన భవిష్యత్తు చూపెట్టిందని చెప్పవచ్చు. మిమిక్రీ తోనే శివ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ విధంగా పలు సినిమాల్లో అవకాశాలు అందుకుంటు సినిమా ఇండస్ట్రీలో ఒదిగిపోయాడు. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ తన జీవితంలో తాను ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని గురించి వివరించాడు.
తాను సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో కష్టాలు పడ్డాను అని తెలిపాడు. ఆర్టిస్టుగా అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు చాలాసార్లు పస్తులు ఉన్నట్లు తెలిపాడు. ఒక సారీ తన రూమ్ కి తిరిగి వెళుతున్న క్రమంలో తనకి బాగా ఆకలి వేసిందట. ఒక దగ్గర అన్నం పెడుతుంటే తనని కనిపెట్టరు లే అని సిగ్గు విడిచి అక్కడ అన్నం తినడానికి అందరితోపాటు కూర్చున్నాడట. కానీ అక్కడ వారు శివను గుర్తుపట్టి నువ్వు ఈ సినిమాలో నటిస్తున్నావు కదా అని అడిగారట.
దాంతో శివ ఈ సినిమాలో నటించడం లేదు. ఆర్టిస్ట్ కోసం అవకాశాలు వెతుక్కుంటున్నాను అని అన్నాడట. దాంతో శివను అక్కడి నుంచి లేపి నువ్వు తర్వాత తిను అని అన్నారట. ఇక శివ అక్కడ నుంచి లేచి తినకుండా డైరెక్ట్ గా తన రూమ్ కి వెళ్లినట్లు ఆ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.