Manchu Brothers: అన్నాదమ్ముళ్లంటే వాళ్లు.. విష్ణు, మనోజ్ ఇప్పటికైనా మారతారా?

Manchu Brothers: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో మంచు ఫ్యామిలీ ఒకటి.మోహన్ బాబు ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక ఇండస్ట్రీలోకి విష్ణు మనోజ్ లక్ష్మీప్రసన్నలు వచ్చారు.ఇలా వీరు కూడా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందడం కోసం కష్టపడుతున్నారు. ఇకపోతే మనోజ్ విష్ణు లక్ష్మీ ప్రసన్న ముగ్గురు ఒకే తల్లి పిల్లలు కాదు అనే విషయం మనకు తెలిసిందే. మనోజ్ నిర్మల కుమారుడు కాగా విష్ణు లక్ష్మీప్రసన్న మోహన్ బాబు పెద్ద భార్య శ్రీవిద్య పిల్లలనే విషయం అందరికీ తెలిసిందే.

 

ఇలా ఈ ముగ్గురు ఓకే తల్లి పిల్లలు కాకపోయినా చిన్నప్పటినుంచి మోహన్ బాబు వీరందరిని ఒకే విధంగా పెంచి పెద్ద చేశారు. అయితే ప్రస్తుతం మాత్రం వీరి మధ్య గొడవలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా విష్ణు మనోజ్ మధ్య మాటలు లేవని, అందుకే మనోజ్ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది.అయితే నిన్న జరిగిన గొడవతో వీరి మధ్య గొడవలు ఉన్నాయని క్లారిటీ వచ్చేసింది.అయితే విష్ణు మనోజ్ గొడవ పడడానికి గల కారణం ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు.

మంచు మనోజ్ భూమ మౌనికను పెళ్లి చేసుకోవడం విష్ణుకి ఇష్టం లేదని ఒక కారణం వినపడుతోంది అలాగే ఆస్తి విషయంలో ఇద్దరికీ గొడవలు చోటు చేసుకున్నాయని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా వీరి మధ్య ఉన్నటువంటి గొడవలను సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే వీరి మధ్య జరుగుతున్న గొడవలు చూసి పలువురుఈ విషయంపై స్పందిస్తూ అన్నదమ్ములంటే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ని చూసి ఎలా ఉండాలో నేర్చుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కి తండ్రి ఒక్కరైనా తల్లులు వేరు కానీ వీరు ఎప్పుడు కూడా సొంత అన్నదమ్ముల లాగే ఉంటారు.ఇలా అన్నదమ్ములు వీళ్ళ మాదిరిగా ఉండాలంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా విష్ణు మనోజ్ వారి తప్పులను తెలుసుకొని మారుతారా అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ గొడవలపై మంచు ఫ్యామిలీ స్పందిస్తూ వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని ఇది చిన్న గొడవేనని చెబుతున్నప్పటికీ ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -